తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుట్టిన బిడ్డను టాయిలెట్​లో వదిలేసిన బాలిక

తన శిశువును పబ్లిక్ టాయిలెట్​లో వదిలేసింది ఓ బాలిక. కళాశాలలో చదువుతున్న తోటి విద్యార్థితో రిలేషన్​షిప్​లో ఉన్న ఆమె.. తనకు పుట్టిన బిడ్డను బస్టాండ్ సమీపంలోని టాయిలెట్​లో విడిచిపెట్టింది. ఈ ఘటనలో యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

karnataka news
karnataka news

By

Published : Nov 13, 2021, 4:18 PM IST

Updated : Nov 13, 2021, 5:06 PM IST

అప్పుడే పుట్టిన బిడ్డను బస్టాండ్​లో ఉన్న పబ్లిక్ టాయిలెట్​లో పడేసిన కళాశాల విద్యార్థినిని కర్ణాటక (Karnataka news) పోలీసులు అరెస్టు చేశారు. కర్వార్​ (Karwar news today) నగరంలోని ఈ ఘటన జరిగింది. మైనర్​ను గర్భవతిని చేసిన మహమ్మద్ మక్​బూల్ అమ్మద్(19) అనే యువకుడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గతవారం (Karwar news today) బస్టాప్​ పబ్లిక్ టాయిలెట్​లో శిశువు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. తాజాగా ఈ కేసును ఛేదించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీని పరిశీలించిన పోలీసులు.. శిశువును మైనరే టాయిలెట్​లోకి తీసుకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం అక్కడే వదిలేసిందని నిర్ధరణకు వచ్చారు.

యువకుడితో రిలేషన్​షిప్..

బాలికతో పాటు యువకుడు ఒకే కళాశాలలో చదువుకుంటున్నారని, ఇద్దరూ రిలేషన్​షిప్​లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన బాలిక.. ప్రసవం అయిన తర్వాత శిశువును వదిలేసిందని పేర్కొన్నారు. బాలుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

బాలికకు గర్భం చేసిన యువకుడిపై పోక్సో (POCSO case IPC) చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని తెలిపారు. మైనర్​ను పరిశీలనా కేంద్రానికి తరలించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:'గ్రాండ్​పేరెంట్​ స్కామ్'.. వృద్ధురాలికి రూ.5 కోట్లు టోకరా!

Last Updated : Nov 13, 2021, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details