తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుపాకీతో బెదిరించి మహిళపై సామూహిక అత్యాచారం - రాజస్థాన్​ కోటా జిల్లా వార్తలు

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై నలుగురు యవకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తుపాకీతో బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ దారుణ ఘటన జరిగింది. రాజస్థాన్​లో జరిగిన మరో ఘటనలో.. ఓ 16 ఏళ్ల బాలికపై ఓ కిరాతకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చేందుకు కారణమయ్యాడు.

gang rape on women
మహిళపై సామూహిక అత్యాచారం

By

Published : Oct 26, 2021, 9:20 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ జాలౌన్​ జిల్లాలో(Up Jalaun News) అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై నలుగురు యవకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అసలేం జరిగింది?

జాలౌన్​ జిల్లా(Up Jalaun News) ఉరయ్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో.. ఓ మహిళ తన పిల్లలతో కలిసి ఇంట్లో ఉంది. ఆ సమయంలో నలుగురు యువకులు.. గోడ దూకి, ఇంట్లోకి ప్రవేశించారు. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు మహిళ అరిచేందుకు ప్రయత్నించగా ఆమెపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు పోలీసులు తెలిపారు.

అత్యాచారం గురించి బాధిత మహిళ వెంటనే తన భర్తకు తెలియజేసింది. పని ప్రదేశంలో ఉన్న భర్త...హుటాహుటిన ఇంటికి చేరుకుని, ఉరయ్​ పోలీసులకు తెలియజేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టారు.

బాలికపై అత్యాచారం..

రాజస్థాన్​ కోటా జిల్లాలో(Rajasthan Kota News) అమానవీయ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికపై ఓ కిరాతకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చేందుకు కారణమయ్యాడు.

అసలేం జరిగింది?

ఖటోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి(27), 9వ తరగతి చదువుతున్న బాలిక పక్కపక్క ఇళ్లలో ఉంటారు. బాలిక తల్లికి అనారోగ్యం కారణంగా.. ఆమెకు చికిత్స అందించేందుకు ఏప్రిల్​లో జైపుర్​కు తరలించారు. ఆమె సోదరుడు తన తల్లితోపాటు ఉండేందుకు వెళ్లాడు. బాలిక తండ్రి ప్రతిరోజు పొలంలో పని చేసేందుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై నిందితుడు అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు తెలిపారు.

కడుపునొప్పితో బాధపడగా..

అక్టోబరు 18న బాలిక కడుపునొప్పితో బాధపడగా.. తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. బాలిక ఏడు నెలల గర్భిణీ అని తెలిపారు. దీంతో పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా పలు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే.. నిందితుడు పరారీలో ఉండగా.. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

బెదిరించి..

తనపై అత్యాచార విషయాన్ని ఎవరికైనా చెబితే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికను నిందితుడు బెదిరించాడని పోలీసులు తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:21 ఏళ్ల యువతిపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారయత్నం

ఇదీ చూడండి:ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details