కేంద్ర విద్యాశాఖ.. ఆదివారం వర్చువల్గా సమావేశం కానుంది. కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా వాయిదా పడ్డ 12వ తరగతి పరీక్షలపై చర్చించనున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
"అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరై .. విలువైన సలహాలు, సూచనలు తెలపాలని కోరుతున్నాము. ఈ సమావేశం మే 23, ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది."