ktr and harish rao on bandi sanjay arrest : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ అర్ధరాత్రి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే బండి అరెస్టుపై బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ నిలదీశారు. తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు స్పందించారు. బండి సంజయ్ అరెస్టుకు గల కారణాలు చెప్పారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.
KTR Tweet on Bandi Sanjay Arrest issue : స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ నాయకులు... విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్, తదనంతర పరిణామాల నేపథ్యంలో కేటీఆర్.. ట్విటర్ వేదికగా స్పందించారు. 'పిచ్చోని చేతిలో రాయి ఉంటే... వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం కానీ.. అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని' కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటమాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
''పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం... కానీ పిచ్చోని చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రాలు లీకు చేస్తున్నారు. బీజీపీ నేతలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అమాయక విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.'' - ట్విటర్‌లో మంత్రి కేటీఆర్
Minister Harish Rao Comments on bandi arrest ఇక ఇదే విషయంపై మంత్రి హరీశ్‌రావు కూడా స్పందించారు. మెదక్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన బండి సంజయ్‌పై తనదైన శైలిలో మండిపడ్డారు. బీజేపీవి దిగజారుడు రాజకీయాలు అని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలా? అని ప్రశ్నించారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడండని సవాల్ విసిరారు. పిల్లల జీవితాలతో, భవిష్యత్‌తో ఆటలాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.