దిల్లీలో ఆసుపత్రులకు ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇందుకోసం తగిన చర్యలను చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశ రాజధానిలో కరోనా రోగుల చికిత్సకోసం ఉపయోగించే ఆక్సిజన్ కేవలం కొన్ని గంటలకు సరిపోయే అంత మాత్రమే ఉందంటూ అక్కడి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని ఎంత వేడుకున్నా చేతులు ముడుచుకు కూర్చొందని ఆరోపించారు.
దీనిపై స్పందించిన అధికారులు ఆక్సిజన్ కొరతపై వివరణ ఇచ్చారు. దిల్లీలో ఆక్సిజన్ కొరత ఏమాత్రం లేదని పేర్కొన్నారు. మెడికల్ ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచడానికి చేపట్టాల్సిన అన్ని చర్యలను కేంద్రం యుద్ధప్రాతిపదికన చేస్తోందని వివరించారు.