తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు.. మతిస్తిమితం కోల్పోయి..

బంగాల్​ సిలిగురిలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. పదేళ్ల క్రితం తప్పిపోయిన ఓ యువతి తన కుటుంబ సభ్యులను చేరుకుంది. ఓ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అధికారుల సహాయంలో ఆమె తన ఇంటికి చేరుకోగలిగింది. అసలేం జరిగిందంటే..

Mentally unstable Siliguri woman returns home after 10 years in west bengal
పదేళ్ల క్రితం తప్పిపోయి ఇప్పటికి ఇంటికి చేరిన మీనా మిర్దా

By

Published : Dec 17, 2022, 1:51 PM IST

పదేళ్ల క్రితం తప్పిపోయిన యువతి తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకుంది. బంగాల్​ సిలిగురిలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అధికారుల సహాయంతో మీనా సంవత్సరాల తర్వాత తన ఇంటికి చేరుకుంది.

ఇదీ జరిగింది
మెటెలి బ్లాక్‌లోని కిల్‌కోట్ టీ తోట నివాసి అయిన మీనా మిర్దా(24) అనే యువతికి చిన్నప్పటి నుంచి మానసిక పరిస్థితి సరిగా లేదు. దీంతో ఆమె చాలాసార్లు కనిపించకుండా పోయి.. కొన్ని రోజుల తర్వాత తనంతటతానే ఇంటికి వచ్చేది. అయితే పదేళ్ల క్రితం తప్పిపోయిన మీనా మాత్రం మళ్లీ తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికారు. అయినా కూడా మీనా జాడ తెలియరాలేదు. కొంతకాలం వెతికిన తర్వాత.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబ సభ్యులు మీనా ఆచూకీని తెలుసుకునే ప్రయత్నాలను విరమించుకున్నారు.

అయితే ఇటీవల నవంబరు 30 తేదీన బంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హస్పిటల్​లో చేరింది మీనా. ఆమె మానసిక పరిస్థితి బాగోలేని కారణంగా తన పేరు, చిరునామా చెప్పలేక పోయింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మీనాను తన ఇంటికి చేర్చేందుకు వైద్య కళాశాల అధికారులు చొరవ తీసుకుని సిలిగురి లీగల్ ఎయిడ్ ఫోరమ్‌ను ఆశ్రయించారు. కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆమె ఫొటోలను అధికార యంత్రాంగానికి, సామాజిక కార్యకర్తలకు, పోలీసు అధికారులకు పంపింది. సమాచారం పంపించిన 24 గంటల్లో మీనా ఆచూకీ దొరికగా.. శుక్రవారం మీనాను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details