తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో పొత్తులపై కాంగ్రెస్​ తర్జనభర్జన - rahul gandhi news today

బంగాల్​లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలతో పొత్తు కుదర్చుకుని కాంగ్రెస్​ను సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు రాహుల్​ గాంధీ. అయితే ఆయన ​ నిర్ణయంపై బంగాల్​ కాంగ్రెస్​ సీనియర్​ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వామపక్షాలతో పొత్తును వారు విభేదిస్తున్నారు.

Alliance with the Left, many in state Congress still do not want
వామపక్షాలతో పొత్తు వద్దంటున్న బంగాల్​ కాంగ్రెస్ నేతలు!

By

Published : Nov 29, 2020, 5:42 PM IST

వరుస ఓటములు చవిచూస్తున్న కాంగ్రెస్... వచ్చే ఏడాది జరిగే బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా ఆశించిన ఫలితాలు సాధించి ఉనికి చాటుకోవాలని భావిస్తోంది. అయితే ఎన్నికల్లో ఎవరితో జట్టు కట్టాలనే విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో విభేదిస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. వామపక్షాలతో పొత్తు కుదుర్చుకోవాలన్న రాహుల్ ప్రతిపాదనను వారు వ్యతిరేకిస్తున్నారు.

బంగాల్​ కాంగ్రెస్​ నాయకులతో శనివారం సుదీర్ఘంగా జరిగిన వర్చువల్​ సమావేశంలో వామపక్ష కూటమితో పొత్తు కుదుర్చుకోవాలని కాంగ్రెస్​ నేతలకు సూచించారు రాహుల్​ గాంధీ. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని బంగాల్ కాంగ్రెస్ నాయకులకు స్పష్టం చేశారు. భాజపా, తృణముల్ కాంగ్రెస్​కు వ్యతిరేకంగా నిలబడి బంగాల్​ ప్రజల మద్దతు మూటగట్టుకోవాలని పిలుపునిచ్చారు.

వామపక్షాలతో సీట్ల పంపకం విషయంపైనా రాహుల్ చర్చించినట్లు బంగాల్​ కాంగ్రెస్​ నేతలు తెలిపారు. పార్టీ నాయకులంతా రాహుల్​ అభిప్రాయంతో ఏకీభవించినట్లు పేర్కొన్నారు. అయితే సీనియర్ నేతలు మాత్రం సీట్ల పంపకం విషయంలో విభేదించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: జైల్లో నుంచే ఎన్నికల్లో గెలుస్తా: బంగాల్​ సీఎం

ABOUT THE AUTHOR

...view details