ట్రాన్స్‌జెండర్ అనగానే.. మనకు సంబంధంలేని వ్యక్తులు అనే భావన చాలామందిలో కలుగుతుంది. మెజారిటీ సమాజం వారికి దూరంగానే ఉంటోంది. అలాంటి భావనను దూరం చేసి.. సమాజంలో తామేమీ తక్కువ కాదని చాటి చెబుతోంది కర్ణాటకకు చెందిన ట్రాన్స్‌జెండర్ దీపు బుద్ధే.
ట్రాన్స్జెండర్ల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు పరిశోధక విద్యార్థిగా మారింది. కర్ణాటకలో పీహెచ్డీ చేస్తున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు పొందింది దీపు బుద్ధే.
చామరాజనగర జిల్లాలోని హెగ్గవాడిపుర గ్రామానికి చెందిన దీపును చిన్నప్పుడు గురుస్వామి అని పిలిచేవారు. 8వ తరగతికి వచ్చాక తనలోని అమ్మాయి లక్షణాలను గుర్తించింది దీపు. డిగ్రీ వరకు అబ్బాయిలానే చదివింది.
ఆ తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా మారింది. అప్పటినుంచి తనలో తాను కుమిలిపోయింది. డిప్రెషన్లోకి వెళ్లింది. కొన్నాళ్లు యాచించింది. ఈ చీకటి రోజుల నుంచి కొద్ది రోజులకు బయటపడింది.
దూర విద్యలో ఏంఏ..
తనలో ధైర్యాన్ని కూడగట్టుకొని.. తనలాంటి వారి అభ్యున్నతికోసం ఏదైనా చేయాలనుకుంది. దీని కోసం చదువే ఏకైక మార్గం అని భావించింది. దూర విద్యలో ఎంఏ పూర్తి చేసింది. 80శాతం స్కోరుతో ఉత్తీర్ణత సాధించి పట్టా పొందింది.
ప్రొఫెసర్లు బాసటగా..