తెలంగాణ

telangana

By

Published : Jun 24, 2021, 7:54 AM IST

ETV Bharat / bharat

'రూబిక్స్'​లో గిన్నిస్​ రికార్డు- లిటిల్​ మాస్టర్​ ఫిదా​

కేవలం 15.56 సెకన్లలో రూబిక్ క్యూబ్ పజిల్​ పూర్తి చేసి.. 2019 వరకు ఉన్న16.96 సెకన్ల గిన్నిస్​ వరల్డ్​ రికార్డును బ్రేక్​ చేశాడు ముంబయికి చెందిన ఐమన్​ కోలీ అనే యువకుడు. అతని​ ప్రతిభ చూసి గతంలో.. క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందుల్కరే ఆశ్చర్యపోయాడు. దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు.

Rubik cube
రూబిక్ క్యూబ్ పజిల్

రూబిక్​ క్యూబ్​తో గిన్నిస్​ రికార్డు

రంగు రంగుల గళ్లతో.. ఆరు ముఖాలున్న ఓ చిన్ని చతురస్రం.. ఎంత తిప్పినా ఒక వైపు మాత్రమే ఒకరంగులోకి మారుతుంది.. మిగిలిన ముఖాలు ఓ పట్టాన ఒక్కరంగులోకి మారవు. మరి, ఆ రూబిక్ క్యూబ్ పజిల్ పూర్తి చేయడమంటే మాటలా! అదీ డైస్​ క్యూబ్​ వైపు చూడకుండా..రికార్డు టైమ్​లో పూర్తి చేయడం మామూలు విషయం కాదు కదా! కానీ.. మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఐమన్​ కోలీ ఈ ఘనత సాధించాడు.

కేవలం 15.56 సెకన్లలో పజిల్​ పూర్తి చేసి.. 2019 వరకు ఉన్న 16.96 సెకన్ల గిన్నిస్​ వరల్డ్​ రికార్డును బ్రేక్​ చేశాడు.

"నేను 3వ తరగతిలో ఉన్నప్పటి నుంచే సాధన చేస్తున్నప్పటికీ పరిష్కరించలేకపోయేవాణ్ని. యూట్యూబ్​లో చూసి టెక్నిక్​లు నేర్చుకోమని మా నాన్న సలహా ఇచ్చారు. ఓ వీడియో డౌన్​లోడ్ చేసుకుని చూశా. కానీ ఇంట్రెస్ట్ లేక నాలుగో తరగతిలో వదిలేశా. ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఒక టాలెంట్ షో కోసం తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టా. 4x5, 5x5 క్యూబ్​లను సులువుగా పరిష్కరించడం సాధన చేశా.''

-ఐమన్​

ఐమన్​ ప్రతిభ చూసి క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందుల్కరే ఆశ్చర్యపోయాడు. దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు.

"కళ్లారా ఐమన్​ ప్రతిభ చూసి ఆశ్చర్య పోయా. అసలు క్యూబ్​ వైపు చూడకుండా క్షణాల్లో పజిల్​ పూర్తి చేశాడు."

-సచిన్​ తెందుల్కర్​

ఒక్కోసారి నిరాశకు గురయ్యే ఐమన్​కు తన తల్లి బాసటగా నిలిచేవారు. మరోసారి ప్రయత్నించాలని ప్రోత్సహించేవారు. ప్రపంచ రికార్డు సాధించాలనేది తన కొడుకు ఆశయమని చెప్పారు ఐమన్ తల్లి తహ్​జీబ్ కోలీ.

"పలుసార్లు విఫలమైనప్పటికీ మా అబ్బాయి ఈ వరల్డ్ రికార్డు సాధించాడు. వాడి లక్ష్యం చాలా పెద్దది. ఒక్కోసారి అమ్మ నా వల్ల కావట్లేదు అని నిరాశకు గురయ్యేవాడు. మళ్లీ ప్రయత్నించు, బాధపడకు అని ధైర్యం చెప్పేదాన్ని. మొదట ఏషియన్ రికార్డు సాధించాడు. అయితే ప్రపంచ రికార్డు సాధించాలనేదే వాడి లక్ష్యం. చాలా తపన పడేవాడు ఆ దిశగా చాలా కష్టపడి సాధించాడు."

-తహ్​జీబ్​ కోలీ, ఐమన్​ తల్లి

ఇదీ చదవండి:ఆ యువకుడి ప్రతిభకు సచిన్​ ఫిదా

ABOUT THE AUTHOR

...view details