గదిలో గాలి ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించడానికి భౌతిక దూరం పాటించడం కన్నా మాస్కులు ధరించడం, మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని శాస్త్ర వేత్తలు పేర్కొన్నారు. కంప్యూటర్ నమూనా సాయంతో వారు లెక్కలు కట్టి ఈ మేరకు తేల్చారు. అమెరికాలోని యూనివ ర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుడితో కూడిన ఒక తరగతి గదిని కంప్యూటర్ పై సృష్టించారు. అందులో విద్యార్థులు మాస్కు ధరించినట్లు చూపారు. వారిలో ఒకరికి ఇన్ ఫెక్షన్ ఉండొచ్చన్న అంచనాతో లెక్కలు కట్టారు. మాస్కు ధరించిన టీచర్ ను ముందుభాగంలో నిలిపారు. అనంతరం 'వెల్స్ రిలే అండ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్' సాయంతో విశ్లేషణలు సాగించారు.