ఝార్ఖండ్‌లోని పాలమూ జిల్లాలో ఒక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. తన ప్రేమను ప్రియుడి ఇంట్లో కాదన్నారని ఉరి వేసుకుంది. గార్హవా గ్రామంలోని రామకుందా పోలిస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు రామకందా జిల్లాకు చెందిన కిరణ్ దేవీగా గుర్తించారు.
ప్రేమను నిరాకరించారని మనస్తాపం, వివాహిత ఆత్మహత్య - వివాహిత ఆత్మహత్య
తన ప్రేమను నిరాకరించారనే బాధతో ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన మూడు నెలలకే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె ప్రేమను ప్రియుడి ఇంట్లో కాదన్నారని మృతిచెందిదని పోలీసులు నిర్ధరించారు.
అసలేం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకందా గ్రామానికి చెందిన కిరణ్ దేవికి మూడు నెలల క్రితమే పెళ్లి అయింది. ఆమెకు మహేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. ఆగస్టు 16 రాత్రి కిరణ్‌ను కలిసేందుకు మహేశ్ వచ్చాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలిసింది. వారందరూ అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా మహేశ్ తప్పించుకున్నాడు. మరుసటి రోజు కిరణ్ ఇంటి వద్ద మరచిపోయిన బైక్‌ను తీసుకునేందుకు వచ్చిన అతడ్ని గ్రామస్థులు పట్టుకున్నారు. కిరణ్‌ను, ఆమె ప్రియుడ్ని చెట్టుకు కట్టేసి కొట్టారు. కిరణ్ భర్త ఆమెను భార్యగా స్వీకరించేందుకు నిరాకరించి, ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. అప్పటి నుంచి ఆమె ప్రియుడు మహేశ్ ఇంట్లో ఉంటోంది. ఇద్దరు వేర్వేరు కులాలకు చెందినందున వీరి ప్రేమను మహేశ్ కుటుంబసభ్యులు నిరాకరించారు. తీవ్ర మనస్తాపానికి గురైన కిరణ్ ఆత్మహత్యకు పాల్పడింది.
ఇదీ చదవండి: