Married Woman Cheated Young Man :జీవితంలో సరైన తోడును వెతుక్కునేందుకు ఎన్నోడిజిటల్ వేదికలు వచ్చాయి. తమకు నచ్చిన వరుడు, వధువు కోసం.. ఎంతో మంది మాట్రిమొని లాంటి వేదికలను ఆశ్రయిస్తున్నారు. అయితే వీటినీ కొంతమంది కేటుగాళ్లు.. వికృత చేష్టలకు వేదికగా మార్చుకుంటున్నారు. మొదటగా.. వివాహానికి ముందే కొన్ని వ్యక్తిగత వివరాలు పరస్పరం పంచుకుందామని మర్యాద పూర్వకంగా అభ్యర్థిస్తున్నారు. వారితో మంచిగా నడుచుకొని డబ్బు దండుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ఇదే తరహా ఘటన వెలుగు చూసింది.
'నీవు లేని లోకంలో ఉండలేను.. నీవెంటే నేను'.. ప్రియుడి మరణం తట్టుకోలేక..
భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్న ఓ వివాహిత.. యువకుడికి వధువుగా పరిచయమై అతడిని మోసం చేసిన ఘటన బోధన్ మండలంలో వెలుగు చూసింది. ముఖ పరిచయం లేకుండా ఏడాదిగా పెళ్లి చేసుకుంటానంటూ చెబుతూ అతని నుంచి రూ.4 లక్షలు తీసుకుంది. ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. తెలిసిన సమాచారం మేరకు.. బోధన్ ఉమ్మడి మండలానికి చెందిన ఓ యువకుడు ప్రైవేటు ఉద్యోగి(Private Employee)గా పని చేస్తున్నాడు. పెళ్లి సంబంధాల కోసం మాట్రిమొనీలో పేరు నమోదు చేసుకున్నాడు.
వీడియోకాల్‌తో పలకరించి.. వలపు వల..:మాట్రిమొనీ నుంచి యువకుడి ఫోన్ నెంబరు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్‌కు చెందిన స్వాతి అనే వివాహిత గతేడాది అక్టోబరులో తనను తాను యువతిగా పరిచయం చేసుకుంది. ఒకరి సమాచారం ఒకరు తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో సదరు మహిళ వీడియో కాల్ ద్వారా యువకుడిని పలకరించింది. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.