పెళ్లి అంటేనే సందడి. ఇంట్లో జరిగే పెళ్లి వేడుక గురించి ఊరంతా చెప్పుకోవాలని అనుకుంటారు వధూవరుల తల్లిదండ్రులు. రాజస్థాన్లోని ఝున్ఝును జిల్లా ఖేతడీలో జరిగిన ఓ వివాహం ఇప్పుడు స్థానికంగానే కాదు దేశమంతటా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇక్కడ ఒకేసారి ఆరుగురు అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లు జరిగాయి.
స్కూల్ బస్ డ్రైవర్గా పనిచేసే రోహితాక్షవ్కు ఏడుగురు కూమార్తెలు, ఓ కుమారుడు. వీరిలో పెళ్లి ఈడు వచ్చిన ఆరుగురు కుమార్తెలకు వివాహం చేయాలని రోహితాక్షవ్ భావించాడు. ఆరుగురు కూమార్తెలలో ఇద్దరేసి చొప్పున ఇద్దరు అన్నదమ్ములు ఉన్న ఓ కుటుంబంతో సంబంధం నిశ్చయం చేశాడు. పెద్ద కుమార్తె మీనా దుఖేరా, మూడో కుమార్తె సీమాల వివాహం.. హరియాణాకు చెందిన నరేశ్, భైరూసింగ్తో జరిగింది. రెండవ కుమార్తె అంజు, నాలుగో కుమార్తె నిక్కీలు నీమ్కాఠాణాకు చెందిన ధర్మవీర్, విజేంద్రలను పెళ్లాడారు. అదే విధంగా యోగితా, సంగీతల వివాహం.. కుతానియాకు చెందిన ప్రదీప్, మోహిత్లతో జరిగింది.
ఘనంగా పెళ్లి వేడుకలు..