Karnataka Maramma Temple: అమ్మవారిని ఎవరైనా సాధారణంగా పూలతో అలంకరిస్తారు. పండ్లు, పిండివంటలు నైవేద్యంగా ఇస్తారు. నగదు, బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కానుకలుగా సమర్పిస్తుంటారు. కానీ కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా కార్వారలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. అక్కడ మారమ్మ ఆలయంలో దేవతకు నిరుపయోగ, వాడి పడేసిన వస్తువులను సమర్పిస్తున్నారు భక్తులు. ఇంట్లో పనికిరాని వస్తువులు, పాత బట్టలు, చెత్తను కానుకలుగా ఇస్తున్నారు.
Maramma goddess Karnataka: దక్షిణ భారత దేశంలోని శక్తి పీఠాల్లో శిరాజి శ్రీ మారికాంబ దేవి పీఠం కూడా ఒకటి. ఇక్కడ దేవతకు పాత వస్తువులను కానుకగా ఇస్తే కోరిన కోరికలు తీరతాయని ప్రజలు విశ్వసిస్తారు. ఏటా గడి మారి, సీమె మారి పేరుతో ఉత్సవం నిర్వహించి తమ ఇళ్లలోని పాత వస్తువులు, గాజులు, పాత బట్టలు, ఆట వస్తువులను కానుకలుగా సమర్పిస్తుంటారు. దీన్ని మారి హోరె అని పిలుస్తుంటారు.
ఈ జాతర సమయంలో అందరూ తమ ఇంటి నుంచి ఏదో ఒక మొక్కు సమర్పించుకుంటారు. ఎక్కువగా చీరలు, గాజులు సమర్పిస్తారు. దీనితో పాటు ఉప్పును కూడా ఎక్కువ ఇస్తుంటారు. చర్మ వ్యాధులు మొదలైన సమస్యలు ఉంటే నివారణ అవుతాయని స్థానికుల నమ్మకం.