గ్యాస్ సిలిండర్ల ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి (Sushant Singh Rajput Family Accident) చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. బిహార్లోని లఖీసరాయ్లో ఈ విషాద ఘటన జరిగింది. మృతులను.. దివంగత బాలీవుడ్ నటుడు (Sushant Singh Rajput Family Accident) సుశాంత్ సింగ్ రాజ్పుత్, బిహార్ మంత్రి నీరజ్ సింగ్ బబ్లూ బంధువులుగా అధికారులు గుర్తించారు.
యాక్సిడెంట్లో ఒకేసారి ఆరుగురు మృతి భార్య అంత్యక్రియల నుంచి తిరిగి వస్తుండగా..
సుశాంత్ సింగ్ బంధువు, హరియాణా ఏడీజీ ఓంప్రకాశ్ సింగ్ (Sushant Singh Rajput Family Accident) సోదరి గీతా సింగ్ సోమవారం పట్నాలో అనారోగ్యంతో మృతిచెందారు. భర్త లాల్జీత్ సింగ్ సహా మరో తొమ్మిది మంది బంధువులు ఆమె దహనసంస్కారాల అనంతరం పట్నా నుంచి టాటా విక్టాలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. టాటా విక్టా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. ట్రక్కును వేగంగా ఢీకొనడం వల్ల ఈ వాహనం అమాంతం గాల్లో ఎగిరిపిడినట్లు చెప్పారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:దేశంలో 287 రోజుల కనిష్ఠానికి కరోనా కొత్త కేసులు