తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా లాకర్లలో ఏం దొరకలేదు.. సీబీఐ క్లీన్​చిట్​ ఇచ్చింది'

Delhi Excise Policy Case : మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియాకు చెందిన బ్యాంకు లాకర్లపై సీబీఐ తనిఖీలు చేపట్టింది. దీనిపై స్పందించిన సిసోదియా, సీబీఐ అధికారులకు ఏమీ దొరకలేదని, ఆ ఏజెన్సీ తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ​

Delhi Excise Policy Case
manish sisodia says that CBI given clean chit to him after searching his bank lockers in delhi excise policy case

By

Published : Aug 30, 2022, 5:42 PM IST

Delhi Excise Policy Case : దిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా సీబీఐ.. దిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా బ్యాంక్​ లాకర్లను తనిఖీ చేసింది. అనంతరం తనకు సీబీఐ క్లీన్​ చిట్​ ఇచ్చిందని, ఎంత వెతికినా వారికి ఏం దొరకలేదని సిసోదియా వ్యాఖ్యానించారు. వారు తనిఖీ చేసిన లాకర్లలో కేవలం 70-80 వేల విలువైన ఆభరణాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

మంగళవారం.. దిల్లీ శివారు ప్రాంతమైన వసుంధర, గాజియాబాద్ ప్రాంతాల్లోని పంజాబ్​ నేషనల్ బ్యాంక్​ బ్రాంచీల్లో ఉన్న సిసోదియాకు చెందిన లాకర్లపై నలుగురు సీబీఐ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. తనిఖీల అనంతరం రాజకీయ ఒత్తిడితోనే సీబీఐ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. సీబీఐ నుంచి క్లీన్ చిట్​ లభించినందుకు ఆనందంగా ఉన్నానని చెప్పారు. నాలుగు గంటల పాటు వెతికినా తన లాకర్ల నుంచి ఏమీ దొరకలేదని ఆయన పేర్కొన్నారు.

"రేపు నా బ్యాంక్​ లాకర్లు తనిఖీ చేయడానికి సీబీఐ వస్తోంది. ఆగస్టు 19 తేదీ నా ఇంట్లో దాదాపు 14 గంటల పాటు దాడులు నిర్వహించారు. కానీ వారికి ఏమీ దొరకలేదు. అలాగే లాకర్లలో కూడా వారికి ఏం లభించదు. సీబీఐని నేను స్వాగతిస్తున్నాను. నేను, నా కుటుంబం అధికారులకు సహకరిస్తాం' అని సిసోదియా సోమవారం ట్వీట్ చేశారు.

కేజ్రీవాల్ ఎదుగుతున్నారనే..
రాబోయే 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారనే, దాన్ని ఆపేందుకే, తనను ఈ కేసులో ఇరికించారని సిసోదియా చెబుతున్నారు. అయితే, శుక్రవారం జరిగిన దిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సెషన్​లో కూడా ఆప్​, భాజపాపై విరుచుకుపడింది. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతూ భాజపా సీరియల్​ కిల్లర్​గా వ్యవహరిస్తోందని విమర్శించింది. దాంతో పాటు సీబీఐ ఎఫ్​ఐఆర్​ ఒక బూటకమని, అవన్నీ తప్పుడు ఆరోపణలని పేర్కొంది. అనంతరం సిసోదియా మాట్లాడారు. ప్రతిపక్షాలు అడిగిన అన్ని ప్రశ్నలకూ తాము సమాధానం చెప్పామని పేర్కొన్నారు. కానీ వారు చేసిన అసత్య ఆరోపణలకు సమాధానం ఇవ్వబోమని తెలిపారు.

అయితే, దిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్​ పాలసీ 2021-22ను అమలు చేయడంలో అవకతవకలు జరిగాయని 15 మందిపై ఏఫ్​ఐఆర్​ నమోదైంది. అందులో మనీశ్​ సిసోదియా పేరు కూడా ఉంది. తర్వాత సిసోదియా ఇంటితో పాటు 31 ప్రాంతల్లో ఆగస్టు 19న సీబీఐ సోదాలు నిర్వహించింది.

వేడెక్కుతున్న హస్తిన రాజకీయాలు..
దిల్లీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ఆప్, ప్రతిపక్ష భాజపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు ప్రతివిమర్శలతో నాయకులు రాజకీయాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా దిల్లీ ప్రభుత్వంపై భాజపా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దిల్లీలో 'లిక్కర్​', 'విద్యా' కుంభకోణాలు అవినీతి జంట భవనాలుగా మారాయని విమర్శించింది. అందులో కేజ్రీవాల్​ మరిన్ని అంతస్తులు నిర్మిస్తున్నారని ఎద్దేవా చేసింది.

అవినీతి వారి హక్కుగా మారిందని భాజపా నేత మండిపడ్డారు. ఆ అవినీతికి సంబంధించి విచారణలు చేపట్టినప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. దాంతో పాటు అసెంబ్లీలో నాటకాలాడుతున్నారని అన్నారు.
"దిల్లోని ఓ పాఠశాలలో సీలింగ్ ఫ్యాన్​ ఓ విద్యార్థి మీద పడింది. భవనాన్ని నాసిరకంగా కట్టారు. అందుకే సీలింగ్​ ఫ్యాన్లు కింద పడిపోతున్నాయి. ఇంతవరకు ఆప్​ నైతికత పడిపోయింది. ఇప్పుడు సీలింగ్​ ఫ్యాన్​లు పడిపోతున్నాయి." భాజపా ఎంపీ మనోజ్​ తివారీ అని ఎద్దేవా చేశారు.
దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. "ఎందుకు ఎక్కువ పాఠశాలలు నిర్మించారని భాజపా అంటోంది. మేం దేశంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడానికే ఎక్కువ పాఠశాలలను నిర్మించాం. కానీ భాజపా పాలిత రాష్ట్రాల్లో పాఠశాలల పరిస్థితి చాలా దారుణంగా ఉంది" అని ఆరోపించారు.

ఇవీ చూడండి: చుట్టూ వరద.. తాడుకు వేలాడుతూ ఆస్పత్రికి గర్భిణీ

ఆస్పత్రికి వెళ్లాక ఓపెన్ కాని అంబులెన్స్​ డోర్​, అరగంట శ్రమించినా నో యూజ్, వృద్ధుడు మృతి

ABOUT THE AUTHOR

...view details