తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోన్​ ఇవ్వలేదని బ్యాంక్​​నే తగలబెట్టాడు! - Man sets bank on fire in Haveri

లోన్​ ఇవ్వలేదని ఓ వ్యక్తి ఏకంగా బ్యాంక్​నే తగలబెట్టాడు. ఈ ఘటన కర్ణాటక హవేరిలోని హెడిగొండ గ్రామంలో జరిగింది.

Man sets bank on fire for not giving loan in Haveri
లోన్​ ఇవ్వలేదని బ్యాంక్​ను తలగలబెట్టిన ఘనుడు

By

Published : Jan 9, 2022, 8:27 PM IST

లోన్​ ఇవ్వలేదని బ్యాంక్​ను తగలబెట్టిన ఘనుడు

లోన్​ ఇచ్చేందుకు మేనేజర్​ నిరాకరించడం కారణంగా ఓ వ్యక్తి బ్యాంక్​ను తగలబెట్టాడు. ఈ ఘటన కర్ణాటక హవేరిలోని హెడిగొండ గ్రామంలో జరిగింది. నిందితుడ్ని రట్టిహల్లికి చెందిన వసీం అక్రమ్​ ముల్లాగా పోలీసులు గుర్తించారు.

ఇదీ జరిగింది..

వసీం అక్రమ్​ ముల్లా అనే వ్యక్తి హెడిగొండ గ్రామంలోని కెనరా బ్యాంక్​కు వెళ్లి రుణం కావాలని బ్యాంక్​ మేనేజర్​ను అడిగాడు. వివిధ కారణాల రీత్యా మేనేజర్​ లోన్​ను నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడు అయిన వసీం పెట్రోల్​ తీసుకుని బ్యాంక్​ దగ్గరికు వచ్చాడు. అక్కడ ఉన్న కిటికీ అద్దాలను బద్దలు కొట్టి లోపల పెట్రోల్​ చల్లి.. నిప్పంటించాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకున్నారు. ఈ క్రమంలో చేతిలో ఉన్న కత్తితో వారిని కూడా బెదిరించాడు. ఎట్టకేలకు పట్టుకున్న గ్రామస్థులు నిందితునికి దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేశారు.

బ్యాంక్ కాలిపోతున్న విషయాన్ని గ్రామస్థులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలు ఆర్పారు. అప్పటికే చాలా వరకు కంప్యూటర్లు, ఫర్నిచర్​, కీలక దస్త్రాలు కాలిపోయాయి. లాకర్​లో ఉన్న డబ్బు, నగలు భద్రంగా ఉన్నాయని బ్యాంక్​ అధికారులు తెలిపారు. ఈ ఘటన వెనుక మాజీ బ్యాంక్​ అధికారి ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

'సింహా' స్టైల్ మీసంపై మోజు.. పోలీస్ కానిస్టేబుల్ సస్పెన్షన్

ABOUT THE AUTHOR

...view details