తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Meerut news: 130 రోజుల తర్వాత కొవిడ్‌ నుంచి కోలుకొని.. - ఉత్తర్​ప్రదేశ్ కొవిడ్ అప్డేట్స్

కొవిడ్​(Meerut news) బారిన పడిన ఓ వ్యక్తి ఏకంగా 130 రోజులు పోరాటం చేసి వైరస్​ను జయించాడు. కళ్ల ముందే కరోనా బాధితులు చనిపోతున్నా.. మనోధైర్యంతో నిలిచాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లో (Meerut news)​ జరిగింది.

covid
కొవిడ్

By

Published : Sep 16, 2021, 4:33 PM IST

కరోనా రెండో దశ(Covid Second Wave India) ఉద్ధృతి సమయంలో మహమ్మారి(Meerut news) బారిన పడిన ఓ వ్యక్తి.. వైరస్‌తో సుదీర్ఘంగా పోరాడి విజయం సాధించారు. 130 రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తన కళ్లముందే ఎంతోమంది కరోనా బాధితులు చనిపోతున్నా.. మనోధైర్యంతో వైరస్‌ను(Covid Update Uttar Pradesh) జయించగలిగారు.

ఉత్తరప్రదేశ్‌లోని(UP Covid Cases) మేరఠ్‌కు (Meerut news) చెందిన 39 ఏళ్ల విశ్వాస్‌ సైనీకి ఈ ఏడాది ఏప్రిల్‌ 28న కరోనా పాజిటివ్‌గా తేలింది. తొలుత ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. వైరస్‌ సోకిన తొలినాళ్లలో ఆయన ఆక్సిజన్‌ స్థాయి 16కు పడిపోయాయి. దీంతో దాదాపు నెలరోజులు వెంటిలేటర్‌పై ఉన్నారు. అయినప్పటికీ మనోధైర్యం కోల్పోలేదు. అలా ఏకంగా 130 రోజుల పాటు వైరస్‌తో పోరాడి చివరకు విజయం సాధించారు. బుధవారం ఆయన డిశ్చార్జ్‌ అయినట్లు ఆసుప్రతి వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా విశ్వాస్‌ మాట్లాడుతూ.. "ఇన్ని రోజుల తర్వాత కోలుకుని ఇంటికి రావడం, మళ్లీ నా కుటుంబసభ్యులతో గడపడం ఎంతో ఆనందగా ఉంది. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నా కళ్లముందే చాలా మంది కొవిడ్‌ బాధితులు (Covid pandemic in India) చనిపోయారు. దీంతో నేను కూడా ఒకింత ఆందోళనకు గురయ్యా. అయితే, వైద్యులు నాలో ఆత్మవిశ్వాసం నింపారు. ఆరోగ్యంపై దృష్టిపెట్టమని చెప్పారు. నేను కూడా ధైర్యం తెచ్చుకున్నా. అలా కొవిడ్‌ను జయించగలిగా" అని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:'అలా అయితేనే పెళ్లిచేసుకుంటాను'.. పీఎం, సీఎంకు లేఖ!

ABOUT THE AUTHOR

...view details