తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీనేజర్​పై హత్యాచారం.. ఆత్మహత్య అనేందుకు లెటర్​తో డ్రామా! - surajpur in jarhi

Man rapes and kills teen: టీనేజర్​​పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. అనంతరం చున్నీతో ఫ్యాన్​కు ఉరివేశాడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని సూరజ్​పుర్ జిల్లాలో జరిగింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి.. అరెస్టు చేశారు.

teenager rape
టీనేజర్​పై అత్యాచారం

By

Published : Mar 27, 2022, 4:41 PM IST

Man rapes and kills teen: టీనేజర్​పై అత్యాచారానికి పాల్పడి, దారుణంగా చంపేశాడు ఓ 23 ఏళ్ల యువకుడు. ఆమె మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన మార్చి 24న ఛత్తీస్​గఢ్​లోని సూరజ్​పుర్​ జిల్లాలో జరిగింది. సాబీర్ అలీని నిందితుడిగా గుర్తించిన పోలీసులు శనివారం అతడిని అరెస్టు చేశారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో.."బాధితురాలు 12వ తరగతి విద్యార్థిని. గురువారం ప్రాక్టికల్ పరీక్షకు హాజరైన తర్వాత సూరజ్​పుర్​ జిల్లాలోని ఉన్న తన ఇంటికి వచ్చింది. బాధితురాలి తల్లి.. అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకునేందుకు బిలాస్​పుర్ ఆసుపత్రిలో ఉంది. బాలిక తమ్ముడు ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు సాబీర్ అలీ అక్కడికి వెళ్లాడు. బాలికపై అత్యాచారం చేసి.. ఆమెను కండువాతో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేశాడు. హత్యను.. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఆమె పేరుతో ఒక లేఖ రాశాడు" అని ప్రాథమిక విచారణ తర్వాత పోలీసులు వెల్లడించారు.

సూరజ్​పుర్​లో నిరసనలు..

బాధితురాలి సోదరుడు, ఇరుగుపొరుగు వారు ఆమె ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. నిందితుడిపై అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. మృతురాలి వయసు కచ్చితంగా తెలియలేదని పోలీసులు చెప్పారు. బాధితురాలు మైనర్​ అయితే పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ఈ ఘటనకు నిరసనగా సూరజ్‌పుర్‌లోని ఓ ప్రాంతంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రదర్శన నిర్వహించారు. బాధితురాలకు న్యాయం చేయాలని .. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:పీహెచ్​డీ దళిత విద్యార్థినిపై అత్యాచారం.. నలుగురు కలిసి రెండేళ్లు..

ABOUT THE AUTHOR

...view details