తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేమించి పెళ్లికి నిరాకరణ- జైల్లోనే తాళి కట్టించిన అధికారులు

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఓ యువకుడు. అయితే అతడికి జైలులోనే ఆమెతో వివాహం జరిపించారు అధికారులు. ఇంతకీ ఏమైందో తెలుసుకోండి.

Man marries lover during jail term for cheating her
ప్రేమించి పెళ్లికి నిరాకరణ.. జైళ్లోనే తాళి కట్టించిన అధికారులు

By

Published : Mar 1, 2021, 12:12 PM IST

యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడికి జైలులోనే వివాహం జరిపించారు అధికారులు. ఈ ఘటన ఛత్తీస్​గడ్​లోని కాంకేర్​ జిల్లాలో జరిగింది. దీపక్​ అనే వ్యక్తికి అతడు ప్రేమించిన యువతితో పండితులు, జైలు అధికారుల సమక్షంలో కల్యాణం అయింది.

కాంకేర్​ జైళ్లో వివాహం

ఇదీ సంగతి..

22 ఏళ్ల యువతిని ప్రేమించిన దీపక్​ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం మొండికేశాడు. గ్రామ పెద్దలు మందలించినా ససేమిరా అన్నాడు. దీంతో యువతి అతడిపై పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

జైలులో పెళ్లి

యువతిని మోసగించిన కేసులో 2020 నవంబర్​ 2 నుంచి అతడు కాంకేర్​ జిల్లా జైల్లో ఉంటున్నాడు. ఎట్టకేలకు ఆమెతో పెళ్లికి అంగీకరించాడు. వివాహం చేసుకోవడానికి అనుమతి కోరుతూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు వారి పెళ్లికి ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:కాశీలో నడ్డా, గువాహటిలో ప్రియాంక పూజలు

ABOUT THE AUTHOR

...view details