Delhi Student Killed : పట్టపగలే పార్కులో ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు దుండగుడు. బెంచ్‌పై కూర్చున్న యువతితలపై వెనక నుంచి ఇనుప రాడ్డుతో కొట్టి దారుణంగా చంపాడు. ఈ ఘటన దిల్లీ మాలవీయనగర్ శివాలిక్‌లోని విజయ్ మండల్ పార్క్‌లో జరిగింది. యువతిని ఇనుప రాడ్డుతో తలపై కొట్టిన అనంతరం.. యువకుడు అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. యువకుడి దాడితో యువతి తల పగిలి ఆ ప్రాంతమంతా రక్తం పారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతి సమీపంలో పడి ఉన్న ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ జరిగింది
నిందితుడు ఇర్ఫాన్ (28) డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇర్ఫాన్ బంధువైన యువతి(22) దిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటోంది. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేధించేవాడు ఇర్ఫాన్. ఈ విషయం యువతి ఇంట్లో చెప్పగా.. ఉద్యోగం లేదన్న కారణంతో ఇర్ఫాన్‌తో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన నిందితుడు.. పార్క్‌లో కూర్చున్న యువతిని దారుణంగా రాడ్‌తో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
స్వాతి మలివాల్ విచారం
ఈ దారుణ హత్యపై దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసులకు నోటీసులు జారీ చేశారు. దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని మలివాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
10ఏళ్ల బాలికను గ్యాంగ్‌రేప్.. 10 అడుగుల లోతులో పాతిపెట్టి..
10 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి అతి దారుణంగా చంపారు దుండగులు. అనంతరం బాలిక మృతదేహాన్ని ఇంటి పునాది కింద 10 అడుగుల లోతులో పూడ్చిపెట్టారు. ఈ ఘటన బిహార్‌లోని బెగుసరాయ్‌లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.