Man killed For Breaking Mobile Phone: మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో దారుణం జరిగింది. ఫోన్ పగులకొట్టాడనే కారణంతో ఓ కూలీని హత్య చేశాడో యువకుడు. బాధితుడు సలీరామ్ అలియాస్ రింకు కుమార్(31), నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్ సిద్ధార్ద్ నగర్ జిల్లాకు చెందినవారు. పనికోసం వలస వచ్చి నాగ్‌పుర్‌లో ఒకే దగ్గర నివసిస్తున్నారు. ఈ క్రమంలో రింకు కుమార్ తన కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఫోన్ చేయాలనుకున్నాడు. పక్కనే ఉన్న యువకున్ని ఫోన్ అడిగాడు. అందుకు నిందితుడు ఒప్పుకోలేదు. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.
ఫోన్ పగులకొట్టాడని.. కూలీని హత్య చేసిన యువకుడు..
Man killed For Breaking Mobile Phone: ఫోన్ పగులకొట్టాడని ఓ కూలీని హత్య చేశాడో యువకుడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో జరిగింది.
హత్య
అనంతరం అదే ఫోన్లో మాట్లాడిన కుమార్.. మొబైల్‌ను నేలకు కొట్టాడు. దీంతో ఫోన్ పగిలిపోయింది. ఆగ్రహంతో యువకుడు కుమార్‌పై దాడి చేసి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. రింకు కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:మూడో భార్యతో కలిసి రెండో భార్య హత్య.. పెట్రోల్ పోసి నిప్పంటించి..
Last Updated : Mar 25, 2022, 11:44 AM IST