తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. సొంత మేనమామే..! - రేప్​ కేసులు

మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో (maharashtra thane news) మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారిని ఆడించే నెపంతో ఆమెను అతని ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

maharashtra thane
మహారాష్ట్రలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం

By

Published : Sep 18, 2021, 10:40 AM IST

Updated : Sep 18, 2021, 11:17 AM IST

మహారాష్ట్ర ఠాణె జిల్లాలో (maharashtra thane news) మరో అమానవీయ ఘటన బయటపడింది. ఓ 6 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. సొంత మేనమామనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సెప్టెంబరు 13న ఉల్హాస్​నగర్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం..

బాధితురాలి ఇంటి సమీపంలోనే నివసించే నిందితుడు.. చిన్నారిని ఆడించే నెపంతో ఆమెను అతని ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఈ విధంగా ఇప్పటికే అనేక సార్లు అత్యాచారానికి పాల్పడినా.. భయంతో చిన్నారి ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది. అయితే ఈనెల 13న బాధితురాలిపై నిందితుడు అత్యాచారానికి పాల్పడుతుండగా చిన్నారి సోదరుడికి పట్టుబడ్డాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడిపై సెక్షన్​ 376, పోక్సో చట్టాల (pocso act) కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టు చేశారు.

11 ఏళ్ల బాలికపై..

ముంబయిలో మరో దుర్ఘటన వెలుగు చూసింది. కంజుమార్గ్​ ప్రాంతంలోని రెసిడెన్షియల్​ సొసైటీలో నివసిస్తున్న ఓ 11 ఏళ్ల బాలికపై అక్కడి వాచ్​మెన్​ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్ట్​ చేశారు. నిందితుడిపై సెక్షన్​ 354, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి :ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం.. ఆకలితో చిన్నారి మృతి

Last Updated : Sep 18, 2021, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details