తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జల్లికట్టుకు మరో ప్రాణం బలి - bull stabbed man in at tamilnadu jallikattu

జల్లికట్టు పోటీలు చూసేందుకు వచ్చిన ఓ యువకుడు.. ఎద్దు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ మరణించాడు.

Man died as bull stabbed him at Jallikattu
జల్లికట్టుకు మరో ప్రాణం బలి

By

Published : Jan 17, 2021, 11:21 AM IST

Updated : Jan 17, 2021, 11:51 AM IST

జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని మధురై ప్రాంతంలో నిర్వహించిన ఈ ఎద్దుల పోటీ.. ఓ యువకుడి ప్రాణం బలితీసుకుంది.

అలంకనల్లూర్​లో శనివారం జరిగిన జల్లికట్టు పోటీలకు నవమణి(24) అనే వ్యక్తి వచ్చాడు. పోటీలను వీక్షిస్తుండగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న ఓ ఎద్దు తిరగబడింది. నవమణిపై దాడి చేసింది. కొమ్ములతో కుమ్మేసింది.

తీవ్రంగా గాయపడిన నవమణికి అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో తొలుత ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మధురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.

ఇదీ చదవండి:జల్లికట్టు వేడుకలో అపశ్రుతి- ఇద్దరు మృతి

Last Updated : Jan 17, 2021, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details