తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆత్మహత్య చేసుకున్న సోదరి.. అంబులెన్స్​ ​లేక 10 కి.మీ బైక్​పైనే.. - ఉత్తర్​ప్రదేశ్ కౌశాంబి లేటెస్ట్ న్యూస్​

పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లే సరికే మృతి చెందింది. అయితే మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్​ను అందించలేదు. దీంతో మృతురాలి సోదరుడు మృతదేహాన్ని బైక్​పై పెట్టుకుని దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

man carries body on bike in Uttar Pradesh
man carries body on bike in Uttar Pradesh

By

Published : Mar 17, 2023, 11:39 AM IST

అంబులెన్స్​ ​లేక శవాన్ని10 కి.మీ బైక్​పై తీసుకెళ్లిన సోదరుడు

ఉత్తర్​ప్రదేశ్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఆత్మహత్య చేసుకున్న తన సోదరి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి బైక్​పై పట్టుకుని దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించాడో సోదరుడు. పరీక్షలు సరిగా రాయలేదని తీవ్ర మనస్థాపంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆస్పత్రి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. అనంతరం ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్​ సౌకర్యం కల్పించకపోవడం వల్ల ఆమె సోదరుడు మృతదేహాన్ని బైక్​పై ఇంటికి తీసుకువెళ్లాడు.

అసలేం జరిగిందంటే..
కౌశాంబి జిల్లాలోని భర్వారీ ప్రాంతానికి చెందిన నిరాశా దేవి(17) అనే బాలిక ఇటీవలే ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు రాసింది. అయితే దేవి ఈ పరీక్షలు సరిగా రాయలేదని ప్రతిరోజు ఆందోళన చెందుతూ ఉండేది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై.. ఇంట్లో వారు ఎంత వారించినా సరే సరిగా భోజనం కూడా చేసేది కాదు. అయితే గురువారం ఉదయం కుటుంబసభ్యులందరూ పొలానికి వెళ్లగా.. దేవి ఒంటరిగా ఇంట్లోనే ఉంది. పరీక్షలు ఫెయిలవుతాననే భయంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు చేసుకుంది. కొద్ది సేపటి తర్వాత ఇంటికి చేరుకున్న ఆమె కుటుంబసభ్యులు కొన ఊపీరితో ఉన్న దేవిని చూసి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అయితే బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని తేల్చారు. దీంతో దేవి కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లడానికి.. అంబులెన్స్​ ఏర్పాటుచేయాలని ఆస్పత్రి సిబ్బందిని కోరారు. దాదాపు అరగంటకు పైగా వేచి చూసినా సరే.. సిబ్బంది అంబులెన్స్​ సౌకర్యాన్ని కల్పించలేదు. దీంతో మృతురాలి సోదరుడు కుల్దీప్​ అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఓ పక్క సోదరి మృతి, మరో పక్క సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తీవ్ర నిరాశ చెందిన కుల్దీప్..​ తన సోదరి మృతదేహాన్ని బైక్​పైనే ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు బైక్​పై తన వెనుక మరో ఇద్దర్నీకూర్చోబెట్టుకుని సోదరి మృతదేహాన్ని ఇంటికి చేర్చాడు. అయితే వీరు బైక్​పై మృతదేహాన్ని తరలిస్తుండగా.. రహదారిపై వారిని పోలీసులు చూసినా సరే పట్టించుకోకపోవడం విశేషం. దేవి మృతదేహం ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు దేవి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్​ సుజిత్​ కుమార్​ దీనికి కారణమైన వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

బైక్​పైనే చిన్నారి మృతదేహం
అచ్చం ఇలాంటి అమానవీయ ఘటనే మరొకటి ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్​లో జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. ఓ వ్యక్తి తన 8 నెలల కుమార్తె మృతదేహాన్ని బైక్​పై తీసుకువెళ్లాడు. గురువారం ఉదయం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది. దీంతో చిన్నారి మృతదేహాన్ని తీకువెళ్లడానికి మృతురాలు కుటుంబసభ్యులు ఆస్పత్రి బయట ఎన్ని గంటలు వేచి చూసినా సరే.. అక్కడి సిబ్బంది అంబులెన్స్​కు ఏర్పాటు చేయలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన చిన్నారి తండ్రి మృతదేహాన్ని బైక్​పై తీసుకుని ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో బయటకు రావడం వల్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్​ సలీల్​ శ్రీవాస్తవ స్పందించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రెండు అంబులెన్స్​లు అందుబాటులో ఉన్నాయని.. వాటిని వారికి ఏ కారణంతో అందించలేదో తెలుసుకోవడానికి విచారణ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details