మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన గ్రామం మినీ పాకిస్థాన్ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. వైరల్ అయిన ఈ పోస్ట్‌పై స్పందించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా అమిరతి గ్రామానికి చెందిన అఫ్సర్ ఖాన్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న అఫ్సర్ ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో 'మినీ పాకిస్థాన్' గ్రామం!
తన గ్రామం పేరు మినీ పాకిస్థాన్ అని పేర్కొన్న ఓ వ్యక్తిపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మినీపాకిస్థాన్ వివాదం
ఒమన్, సౌదీ అరేబియాకు వలస వెళ్లిన నిందితుడు ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. అఫ్సార్ చేసిన పోస్ట్ మత కలహాలకు దారితీసే అవకాశం ఉన్నందున అతడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :బస్తాల్లో ఇసుక విక్రయం- ప్రభుత్వం యోచన