తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువకుడిని చంపి 400 ముక్కలు చేసిన తండ్రీకొడుకులు- 15 సంచుల్లో కుక్కి వివిధ ప్రాంతాల్లో వేసిన నిందితులు - rajukhan murder case in gwalior

Man Body Choped Into 400 Pieces : శ్రద్ధా వాకర్ తరహాలోనే మధ్యప్రదేశ్​లో మరో దారుణ హత్య జరిగింది. ఓ యువకుడిని డంబెల్​తో హత్యచేసి శరీర భాగాలను 400 ముక్కలుగా చేశారు తండ్రి,కొడుకులు. రెండు నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం జరిగిన ఈ కేసును పోలీసులు చేధించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Gwalior Murder Case
Gwalior Murder Case

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 4:19 PM IST

Man Body Choped Into 400 Pieces : ఓ యువకుడిని దారుణంగా హత్యచేసి శరీర భాగాలను 400 ముక్కలుగా చేశారు తండ్రీకొడుకులు. అనంతరం వాటిని వివిధ ప్రాంతాల్లో విసిరేశారు. శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే జరిగిన ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. రెండు నెలల క్రితం జరిగిన ఈ హత్య కేసులో నిందితులను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అసలేమైందంటే?

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..గ్వాలియర్​లోనిబహదుర్​పుర్​కు చెందిన రాజు ఖాన్​కు అదే ప్రాంతానికి చెందిన తండ్రీకొడుకులు కల్లు ఖాన్​, నజీమ్​లతో ఏదో విషయంలో గొడవ జరిగి కేసు నమోదైంది. దీంతో కేసు రాజీ చేసుకుందామని తండ్రీకొడుకులైన కల్లు ఖాన్​, నజీమ్​లు.. రాజుఖాన్​ను తమ ఇంటికి పిలిపించారు. అయితే, కేసు వెనక్కి తీసుకునేందుకు రూ. 20 వేల ఇవ్వాలని కోరారు రాజుఖాన్​. డబ్బులు ఇస్తానని నమ్మించిన నిందితులు.. సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటి వద్దకు రావాలని కోరారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న తర్వాత వారి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడే గదిలో ఉన్న డంబెల్​తో రాజుఖాన్ తలపై బలంగా కొట్టి హత్య చేశారు తండ్రీకొడుకులు. తర్వాత మృతిచెందిన రాజ్​ఖాన్​ శరీర భాగాలను 400 ముక్కలుగా చేసి 15 సంచుల్లో పెట్టి గుట్టుచప్పుడు కాకుండా వివిధ ప్రాంతాల్లో వేశారు.

మరోవైపు.. గ్వాలియర్​లోని జనక్​గంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ డ్రైనేజీలో సెప్టెంబర్ 28న ఓ గుర్తుతెలియని వ్యక్తి మొండెం కనిపించింది. ఈ విషయంపై ఆరా తీసిన పోలీసులు.. ఆ మొండెం బహదుర్​పుర్​కు చెందిన రాజుఖాన్​దిగా గుర్తించారు. రాజుఖాన్​ శరీర భాగాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్​కు పంపించారు. దీనిపై కుటుంబసభ్యులను విచారించగా.. స్మగ్లర్​ కల్లు ఖాన్ కుమారుడైన నజీం ఖాన్​ హత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. అయితే, తాము హత్యచేసిన వ్యక్తి శరీర భాగాలు పోలీసులకు లభించాయని తెలుసుకున్న నిందితులు.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కల్లూ ఖాన్​, నజీం ఖానే హత్యకు పాల్పడి ఉంటారనే పోలీసులు అనుమానం మరింత బలపడింది.

దీనిపై కేసు నమోదు చేసకున్న పోలీసులు.. నిందితులైన తండ్రీకొడుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు డ్రగ్స్​కు సంబంధించిన కేసు విచారణ కోసం కల్లూఖాన్​ కోర్టులో హాజరుకాగా.. అతనికి జైలుశిక్ష విధించింది. మరోవైపు అతని కుమారుడు పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఎట్టకేలకు పోలీసులు అతడిని ఆగ్రాలో అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో తండ్రిని, కొడుకును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు పోలీసులు. దీంతో హత్య చేసినట్లుగా అంగీకరించారు.

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మాదకద్రవ్యాలకు బానిసై కుమార్తెను చంపిన తండ్రి
మాదకద్రవ్యాలకు బానిసైన ఓ తండ్రి కన్న కూతురుని నేలకు కొట్టి చంపాడు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో జరిగింది. సీతాపుర్​కు చెందిన మమతకు, దర్నాగ్​కు చెందిన సౌరబ్​తో ఏడాది క్రితం ప్రేమ వివాహం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ గెస్ట్​హౌస్​లో సౌరబ్​ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సోమవారం నిందితుడు డ్యూటీ అయ్యాక మాదకద్రవ్యాలు సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారితీసింది.

భార్యపై దాడి చేసిన సౌరబ్..​ఆమె చేతిని విరగ్గొట్టాడు. అంతటితో ఆగకుండా మంచంపై నిద్రిస్తున్న తన మూడు నెలల కుమార్తెను ఎత్తుకుని నేలకు కొట్టాడు. ఆ మత్తులో తన కూతురు చనిపోయేంతవరకు కొడుతూనే ఉన్నాడు. చివరకు ఆ పసిపాప ప్రాణాలు విడిచింది. ఇంటినుంచి ఎలాగోలా బయటకు వచ్చిన బాధితురాలు ఇరుగుపొరుగు వారికి చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పాప మృతదేహన్ని పోస్ట్​మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయంలో యువకుడి హత్య.. దారుణంగా పొడిచి.. శివలింగం దగ్గర పడేసి..

రైతు దారుణ హత్య.. మొండెం నుంచి తల వేరు చేసి...

ABOUT THE AUTHOR

...view details