అదనపు కట్నం కోసం భార్య పట్ల క్రూరంగా ప్రపర్తించి.. బలవంతగా యాసిడ్ తాగించాడు అమె భర్త. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిందీ దారుణ ఘటన. ఈ క్రూరత్వాన్ని ఒడిగట్టిన ఆ వ్యక్తిని.. పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేమైందంటే..

'మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్‌కు.. శశి అనే యువతితో ఈ ఏడాది ఏప్రిల్ 17న పెళ్లైంది. యువతి తల్లిదండ్రులు రూ.10 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా వివాహం జరిపించారు. అయితే వీరేంద్ర కుమార్ కారు కొనేందుకు.. రూ.3 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని భార్యను ఇటీవల వేధించసాగాడు. అదనపు కట్నం గురించి తల్లి దండ్రులతో మాట్లాడేందుకు శశి నిరాకరించింది. దీనితో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. వీరేంద్ర కుమార్ భార్యను కిందకు తోసి.. బలవంతంగా యాసిడ్ తాగించాడు. దీనితో ఆమె ఆరోగ్య క్షీణించింది' అని పోలీసులు తెలిపారు.
యాసిడ్ వల్ల శరీరంలో పలు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. మెరుగైన వైద్యం కోసం దిల్లీ ఆస్పత్రికి అమెను తరలించినట్లు స్థానిక వైద్యులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వీరేంద్ర కూమార్‌పై కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి:viral video: నమస్తే పెట్టలేదని కర్రలతో దాడి