దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడిన తరుణంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(mamata banerjee news ) చేసిన వ్యాఖ్యలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తమ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో అధిక భాగం టీకా రెండు డోసులు తీసుకున్న వారే ఉంటున్నారని వ్యాఖ్యానించారు(west bengal covid cases graph). పూర్తి వ్యాక్సినేషన్ అయినప్పటికీ రోగనిరోధక శక్తి ఆరు నెలలకు మించి ఉండటం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. ఇందుకు గల కారణాలు అన్వేషించే బాధ్యతను రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శికి అప్పగించారు.
"టీకాలు తీసుకున్న తర్వాత కోవిడ్ బారిన పడుతున్న రోగులు మరణించకపోవచ్చు. కానీ అసలు వారిలో రోగనిరోధక శక్తి ఎందుకు తగ్గుతోంది? ఇలా చాలా కేసులు బయటపడ్డాయి. రెండు డోసులు పూర్తి చేసుకున్న వారికే వైరస్ సోకుతోంది. రిపోర్టులు ఇదే చెబుతున్నాయి. టీకా తీసుకున్న తర్వాత రోగనిరోధక శక్తి ఆరు నెలలు కూడా ఉండకపోవడమే ఇందుకు కారణం. దీని గురించి బయట మాట్లాకపోయినా, ఇదే నిజం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆరోగ్య కార్యదర్శి ఎన్.ఎస్ నిగమ్‌కు ఆదేశాలిచ్చాను. ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలని అన్నాను. దీనిపై కేంద్రం అధ్యయనం చేస్తోందా? అని ప్రశ్నించమన్నాను."
--మమతా బెనర్జీ, బంగాల్ సీఎం.
నవరాత్రి ఉత్సవాల అనంతరం బంగాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నెల 20,21,22,23 రోజుల్లో వరుసగా 867, 833, 846, 974 కేసులు వెలుగులోకి వచ్చాయి. సోమవారం మరో 805 కేసులు బయటపడ్డాయి(west bengal covid cases today). దీంతో అక్టోబర్ 15 నాటికి 15,79,463గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య.. కొన్ని రోజులకే 15,87,260కు చేరింది. మరణాలు 19,066గా ఉన్నాయి.