ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఇక రాజకీయ వ్యూహకర్త బాధ్యతలు చేపట్టబోనని తెలిపారు. బంగాల్లో టీఎంసీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఎన్నికల సంఘం భాజపాకు సహకరించిందని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు.
ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకున్న పీకే
14:49 May 02
ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకున్న పీకే
"ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఎన్నికల్లో అన్ని విధాలా భాజపాకు సహాయం చేసింది. నిబంధనలు పక్కనపెట్టి.. భాజపాకు కొమ్ముకాసింది. ఓ రకంగా భాజపాకు ఈసీ అనుబంధ సంస్థలా వ్యవహరించింది." అని పేర్కొన్నారు ప్రశాంత్.
శక్తిమంతమైన పార్టీగా భాజపా..
బంగాల్లో భాజపా నేతలు భారీగా ప్రచార ర్యాలీలు చేపట్టినప్పటికీ.. టీఎంసీ గెలుస్తుందని ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కిశోర్ చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో భాజపా శక్తిమంతమైన పార్టీగా మారిందన్నారు. "ఫలితాలు ఒకపక్కే ఉండొచ్చు. కానీ గట్టి పోటీ ఉంటుంది. భాజపా శక్తిమంతమైన పార్టీగా మారుతుంది" అని పేర్కొన్నారు.