తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యార్థులకు రూ.10లక్షల రుణం!

విద్యార్థుల కోసం బంగాల్ ప్రభుత్వం స్టూడెంట్​ క్రెడిట్​ కార్డ్​ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద.. ఉన్నత చదువులను అభ్యసించాలనుకున్న విద్యార్థులకు రూ.10లక్షల వరకు రుణాన్ని అందిస్తారు.

Mamata Banerjee
మమతా బెనర్జీ

By

Published : Jul 1, 2021, 7:16 AM IST

బంగాల్​ రాష్ట్ర సర్కారు.. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం బుధవారం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు దూరమవుతున్నవారి కోసం 'స్టూడెంట్​ క్రెడిట్​ కార్డ్​(ఎస్​సీసీ)' పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డు కింద రూ.10 లక్షల వరకు సులభతరమైన రుణాలు పొందవచ్చు. పదో తరగతి నుంచి పోస్ట్​గ్రాడ్యువేషన్​ వరకు విద్యార్థులు.. ఈ క్రెడిట్ కార్డుతో లబ్ధి పొందవచ్చు.

"స్టూడెంట్​ క్రెడిట్​ కార్డ్​ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలోని యువతను స్వావలంబనగా మార్చడానికి రూ.10 లక్షల వరకు సులభతరమైన రుణాలు సాధారణ వడ్డీతో వారికి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో 10ఏళ్లు గడిపి.. 40 ఏళ్లు వయసులోపు ఉన్న ఎవరైనా దేశంలో లేదా విదేశాల్లో డిగ్రీ, పోస్ట్​ గ్రాడ్యుయేట్​, డాక్టోరల్​, పోస్ట్ డాక్టరల్​ చదివేవారు ఈ రుణాన్ని పొందవచ్చు. అయితే తీసుకున్న రుణాన్ని 15 ఏళ్లలో తిరిగి చెల్లించాలి."

- బంగాల్​ సీఎం మమతా బెనర్జీ

ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ మేనిఫెస్టోలో పేర్కొన్న.. ఈ పథకాన్ని రాష్ట్ర మంత్రివర్గం గత వారమే ఆమోదించింది.

ఇదీ చూడండి:రాహుల్​తో నవ్​జ్యోత్​ సింగ్ సిద్ధూ భేటీ

ABOUT THE AUTHOR

...view details