నందిగ్రామ్ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి సువేందు అధికారి గెలవడంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు.
"రీకౌంటింగ్‌కు ఒప్పుకుంటే తన ప్రాణానికే ప్రమాదముందని నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారి ఎవరికో లేఖ రాసినట్లు నాకు ఒకరు ఎస్ఎంఎస్ పంపారు. నాలుగు గంటలు ఈసీ సర్వర్ డౌన్ అయింది. నేను గెలిచానని గవర్నర్ శుభాకాంక్షలు కూడా చెప్పారు. కానీ.. ఒక్కసారిగా అంతా మారిపోయింది."