తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విజృంభిస్తోన్న కరోనా- మహారాష్ట్రలో 60వేల కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 60,212 మంది వైరస్​ బారిన పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 18,021 మందికి కొవిడ్​ సోకింది.

By

Published : Apr 13, 2021, 10:32 PM IST

Maharashtra sees 60,212 new COVID-19 cases, 281 die
దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా-మహాలో కఠిన ఆంక్షలు

మహారాష్ట్రలో తాజాగా 60,212 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 35,19,208కి చేరింది. మరో 281 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,93,042 యాక్టివ్​ కేసులున్నాయి. పెరుగుతోన్న కేసులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రప్రభుత్వం 15 రోజుల కర్ఫ్యూని విధించింది.

యూపీలో విజృంభణ

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా తీవ్రత పెరుగుతోంది. తాజాగా 18,021 కేసులు వెలుగుచూశాయి. మరో 85 మంది చనిపోయారు.

దిల్లీలో..

దిల్లీలో ఒక్కరోజే 13,468 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 7,50,156కు చేరింది. మరో 81మంది మృతి చెందారు.

కర్ణాటకలో..

కర్ణాటకలో కొత్తగా 8,778 మంది వైరస్​ బారిన పడగా.. 67 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 10,83,647కు చేరింది.

తమిళనాడులో..

తమిళనాడులో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 18 ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 47వేలకు చేరింది.

కేరళలో ఇలా...

కేరళలో మరో 7,000 కేసులు బయటపడ్డాయి. తాజాగా 20 మంది కరోనాతో మరణించారు.

ప్రముఖుల కరోనా సమాచారం

  • యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ హోం క్వారెంటైన్​కు పరిమితం అయ్యారు. తన చుట్టూ ఉండే అధికారుల్లో కొంతమందికి వైరస్​ నిర్ధరణ కావడం వల్ల ఇలా చేసినట్లు తెలిపారు.
  • కేంద్ర మంత్రి సంతోశ్​ గంగ్వార్​ కరోనా బారిన పడ్డారు.
  • భాజపా రాజ్యసభ సభ్యుడు అనిల్​ బలూనికి కొవిడ్​ నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రాష్ట్రం తాజా కేసులు మరణాలు
బంగాల్ 4,817 20
గుజరాత్ 6,690 67
పంజాబ్ 3,845 53
హరియాణా 3,818 16
రాజస్థాన్ 5,528 28

ABOUT THE AUTHOR

...view details