శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆహార్యం గుర్తుకు రాగానే కుర్తా కళ్ల ముందు కదలాడుతుంది. అందులోనూ ముఖ్యంగా కాషాయ రంగు కుర్తానే ఆయన ఎక్కువగా ధరిస్తారు. కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత నుంచి తరచుగా ఫార్మల్ డ్రెస్లో కనిపిస్తున్నారు ఉద్ధవ్ ఠాక్రే. ఇన్షర్ట్ వేసుకొని క్లాస్ లుక్ మెయింటెయిన్ చేస్తున్నారు.
ఇటీవల జరిగిన పలు కార్యక్రమాలకు ఇలాంటి దుస్తులే ధరించారు ఉద్ధవ్. మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్తో జరిగిన సమీక్ష సమావేశానికి.. బ్లూ కలర్ గీతలతో ఉన్న తెల్లటి చొక్కాను ధరించి హాజరయ్యారు.