MAHARASHTRA CABINET EXPANSION: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే మంత్రులకు శాఖలను కేటాయించారు. సీఎం ఏక్నాథ్ శిందే పట్టణాభివృద్ధి, రవాణా, మార్కెటింగ్, మైనారిటీ శాఖతో సహా 11 శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. భాజపా నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు కీలకమైన హోం శాఖ, ఆర్థిక శాఖను అప్పగించారు. వీటితో పాటు న్యాయ శాఖ, నీటి పారుదల శాఖను ఫడణవీస్‌కు కేటాయించారు. మరోవైపు భాజపా సీనియర్ నేత చంద్రకాంత్ పాటిల్‌కు విద్యా, జౌళి శాఖ మంత్రిగా అవకాశం దక్కింది.
భాజపాకు చెందిన రాధాకృష్ణ విఖె పాటిల్ రెవెన్యూ శాఖ కేటాయించారు. భాజపా నేత సుధీర్ ముంగటివార్కు అటవీశాఖ మంత్రిగా అవకాశం దక్కింది. శివసేన నేత అబ్దుల్ సత్తార్‌కు వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే. తానాజీ సావంత్‌కు ఆరోగ్యశాఖ దక్కింది. మంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేయగా.. ఆదివారం వీరందరికి శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే.