Indore Fire Broke: మధ్యప్రదేశ్ ఇందోర్‌లోని విజయ్ నగర్లో శనివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్వర్ణ్ బాగ్ కాలనీలోని ఓ రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగగా.. ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 9 మందిని రక్షించి ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పార్కింగ్‌లో ఉంచిన వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. 3 గంటలు శ్రమించి.. మంటలు అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది.
సీఎం సంతాపం:ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం. ఘటనపై విచారణ జరిపి.. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
షార్ట్ సర్క్యూట్‌తో భవనంలో చెలరేగిన మంటలు.. ఏడుగురు సజీవదహనం - Indore Fire Broke
fire broke out in a two-storey building in Indore.
08:17 May 07
రెండంతస్తుల భవనంలో మంటలు.. ఏడుగురు సజీవదహనం
Last Updated : May 7, 2022, 10:34 AM IST