పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓ బాలిక తల్లిదండ్రులు ఓటు వేసి మద్దతు ఇవ్వలేదని ఆగ్రహించిన స్కూల్ యాజమాన్యం.. ఓ ఎస్సీ విద్యార్థిని పాఠశాలకు రానివ్వకుండా అడ్డుకుంది. ఈ విషయమై బాలిక తండ్రి ఎంత తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని షాజాపుర్లో జరిగింది.
షాజాపుర్లోని ఓ దళిత బాలికకు విద్యా హక్కు చట్టం కింద స్థానిక ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారు. ఆ స్కూల్ డైరక్టర్ రవి పటీదార్ అనే వ్యక్తి ఇంటి నుంచి ఆయన వదిన అయిన సప్నా సచిన్ పటీదార్ భాజపా తరఫున పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే బాలిక నివసిస్తున్న ప్రాంతం నుంచి ఆమెకు ఒక్క ఓటూ పడలేదు.