పర్యటకులను ఆకర్షించేందుకు.. కేరళ ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. ఈ ట్రక్ క్యాంపర్ ప్రాజెక్టుతో పర్యటకులు.. విలాసవంతమైన సదుపాయాలు ఉన్న కారావాన్లో ప్రయాణించి కేరళను చుట్టేయవచ్చు. దీనిని ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్ రియాజ్, రవాణా మంత్రి ఆంటోని రాజు శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ ప్రాజెక్టు కోసం కర్ణాటకకు చెందిన లక్స్ క్యాంపర్ సంస్థతో జతకట్టింది కేరళ ప్రభుత్వం. ఈ కారవాన్ ఓ చిన్నపాటి ఇల్లులా ఉంటుంది. ఇద్దరు పడుకునేందుకు వీలుగా బెడ్రూం, ఏసీ, కిచెన్, బాత్రూం ఉంటాయి. లక్స్ క్యాంపర్ సైట్ ద్వారా దీనిని బుక్ చేసుకోవచ్చు. దీని ధర కేవలం రూ. 5వేలు. 2022 ఫిబ్రవరి నుంచి ఇవి అందుబాటులో ఉండనున్నాయి.