కొవిడ్-19 టీకా బూస్టర్ డోసు అవసరమా? లేదా? అన్న విషయంపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ వ్యాక్సిన్ అయినా.. వైరస్ నుంచి పూర్తి స్థాయిలో రక్షణ ఇవ్వలేదని పేర్కొంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇమ్యూనిటీని పెంచేందుకు.. బూస్టర్ డోసు అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. దీనిపై అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలా? లేదా? అనే అంశంపై 'కొవాగ్జిన్' ట్రయల్స్ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.