తక్కువ ఖర్చుతో వైద్యపరిమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటును దేహ్రాదూన్‌లోని భారతీయ పెట్రోలియం సంస్థ రూపొందించింది. 'శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి' (సీఎస్‌ఐఆర్) మార్గనిర్దేశంలో దీనిని సాధించింది. కృత్రిమ మేధస్సును ఉపయోగించుకుని ఎక్కడి నుంచైనా దీనిని పని చేయించుకునే వీలుంటుంది.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న ప్రెషర్ స్వింగ్ అడ్జార్ప్‌షన్ (పీఎస్‌ఏ)లో మార్పులు చేసి ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది రోజుకు 0.2 టన్నుల వైద్యపరమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలుగుతుంది. సాధారణ ప్లాంట్ల కంటే 10% తక్కువ విద్యుత్తును ఇది ఉపయోగించుకుంటుంది. ఆక్సిజన్ శుద్ధత 96% ఉంటుంది. నిర్వహణ వ్యయం సగానికి సగం తగ్గిపోతుంది. సిలిండర్లను అటూఇటూ తరలించడానికి సిబ్బంది అవసరం ఉండదు.