విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఓ ప్రేమజంట.. చోరీల బాటపట్టింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చే వీరు.. యాజమానుల దృష్టిని మరల్చి.. ఆ ఇంట్లోని వస్తువులను దొంగిలించేవారు. కర్ణాటక బెంగళూరులో గతకొంత కాలంగా జరుగుతున్న ఈ తరహా దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు.
ఇదీ వీరి కథ..
అద్దెకు ఇల్లు కావాలని వస్తూ చోరీలు చేసే ప్రేమజంటను వినయ్, కీర్తనగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరికీ మూడేళ్ల క్రితం పరిచయమైంది. వినయ్‌పై ఇప్పటికే రౌడీషీట్ ఉందని, ఓ హత్య సహా.. పలు క్రిమినల్ కేసుల్లో అతను నిందితుడని తెలిపారు. అయితే వినయ్ రౌడీషీటర్ అని తెలిసినప్పటికీ.. అతడిని ప్రేమిస్తున్నట్లు పోలీసులకు వెల్లడించింది కీర్తన. అతని కోసం ఏమైనా చేస్తానని.. జైలుకు కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది.
ప్రస్తుతం వినయ్-కీర్తనలు ప్రేమలో ఉన్నారని.. తనను లాంగ్‌డ్రైవ్‌కు తీసుకెళ్లాలని, ఖరీదైన బహుమతులు ఇవ్వాలని కీర్తన వినయ్‌ని ఒత్తిడి చేసేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. అందుకే దొంగతనాలు చేసేవాడని .. వీటికోసం ఆమెనూ తీసుకువెళ్లేవాడని తేలింది.