తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లగ్జరీ లైఫ్​ కోసం లారీల దొంగతనం.. 278 కెమెరాలు చెక్​ చేసి పట్టుకున్న పోలీసులు

విలాస జీవితానికి అలవాటు పడిన ఓ డ్రైవర్​.. లారీల దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. దాదాపు 278 సీసీటీవీ కెమెరాలను పరిశీలించి.. దొంగను పట్టుకున్నారు పోలీసులు.

Lorry theft for luxury life
Lorry theft for luxury life

By

Published : Jul 14, 2023, 9:55 AM IST

Updated : Jul 14, 2023, 10:35 AM IST

ఓ దొంగను పట్టుకోవడానికి సుమారు 278 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు కర్ణాటక పోలీసులు. అనేక ప్రయత్నాల తర్వాత చెన్నైలో దొంగను అదుపులోకి తీసుకున్నారు బెంగళూరు పోలీసులు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఓ డ్రైవర్.. లారీల దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అసలేం జరిగిందంటే?

ఇదీ జరిగింది
తమిళనాడుకు చెందిన మత్తురాజ్​ వృత్తి రీత్యా ఓ డ్రైవర్​. కానీ విలాసవంత జీవితానికి అలవాటు పడిన ముత్తురాజ్​.. దొంగతనాలు చేస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లోని లారీలను దొంగిలించి అమ్ముతున్నాడు. మరో నిందితుడు.. దొంగిలించిన లారీ ఇంజిన్, ఛాసిస్ నంబర్లను మార్చగా.. మరో వ్యక్తి వాటిని రిజిస్ట్రేషన్​ చేయించి విక్రయిస్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన మొత్తాన్ని ముగ్గురు సమానంగా పంచుకుంటున్నారు. ఇలా ఇప్పటి వరకు 2 లారీలను దొంగిలించి తమిళనాడులో విక్రయించారు.

ఈ క్రమంలోనే మరో లారీ దొంగతనం కోసం తమిళనాడు నుంచి బెంగళూరుకు వచ్చాడు ముత్తరాజ్​. చామరాజ్​పేట్​లోని మెయిన్​రోడ్డుపై పార్క్ చేసిన లారీపై ముత్తురాజ్​ చూపు పడింది. వెంటనే దొంగ తాళం చెవితో లారీని స్టార్ట్ చేసి హోసూర్​ మీదుగా చెన్నైకి చేరుకున్నాడు. అనంతరం తన స్నేహితులకు లారీని అప్పగించగా.. అతడు నకీలీ పత్రాలు సృష్టించి విక్రయించారు.

278 సీసీటీవీ కెమెరాలు చెక్​
మరోవైపు లారీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. ముత్తురాజ్​ హూసూర్​ వైపు వెళ్తున్నట్లుగా తేలింది. అనంతరం బెంగళూరు-చెన్నై మధ్యలో ఉన్న దాదాపు 278 సీసీటీవీ కెమెరాలను పోలీసులను పరిశీలించి.. ముత్తురాజ్​ను పట్టుకున్నారు. అనంతరం అతడిని చెన్నై నుంచి బెంగళూరుకు పట్టుకుని వచ్చారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ముగ్గురు వివరాలను తెలిపారు. వారి వద్ద నుంచి మరో 3 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.8.5 కోట్లు చోరీ.. కూల్​డ్రింక్​ కోసం దొంగ దంపతుల కక్కుర్తి
Ludhiana Cash Van Robbery : అంతకుముందు పంజాబ్​ లుధియానాలో బ్యాంకు దొంగతనం చేసి పారిపోయిన దంపతులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దాదాపు రూ.8.5 కోట్ల సొమ్మును దోచుకొని పారిపోయారు పంజాబ్​కు చెందిన భార్యాభర్తలు. కానీ రూ.10 కూల్‌డ్రింక్‌ కోసం కక్కుర్తిపడి దొరికిపోయారు. వీరెందుకు ఇలా చేశారో? ఎక్కడి నుంచి రూ.8.5 కోట్ల డబ్బును చోరీ చేశారో?తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి :లగ్జరీ కారులో వచ్చి.. మేకను దొంగలించి.. నిమిషాల్లో జంప్​!

దొంగల నయా స్కెచ్.. తాళం పగలలేదు.. తలుపు విరగలేదు.. కానీ ఇంట్లోని 800 గ్రాముల బంగారం చోరీ

Last Updated : Jul 14, 2023, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details