LS Mobile App: లోక్‌సభ సమావేశాల ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించేందుకు వీలుగా రూపొందించిన ప్రత్యేక యాప్‌ను స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ 'ఎల్ఎస్ మెంబర్ యాప్'ను ప్రవేశపెట్టిన స్పీకర్.. సభ్యులు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం సహా వారి నియోజకవర్గ ప్రజలు కూడా వినియోగించుకునేలా కృషి చేయాలని కోరారు.
"పార్లమెంటు సమావేశాలను యూజర్లు లైవ్‌లో వీక్షించేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించారు. ప్రశ్నోత్తరాలు, డిబెట్లు, బులెటిన్లు సహా సభ్యుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. పార్లమెంటుకు సంబంధించిన ముఖ్య పత్రాలు, వివిధ కమిటీల రిపోర్ట్‌లను చూడొచ్చు."
-ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్