జులై 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఆగస్టు 13 వరకు సాగే ఈ సమావేశాల్లో ఉభయ సభలు ప్రతి రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. సమావేశాల ఏర్పాట్లపై ఆరా తీశారు.
ఎంపీలు, మీడియా, సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు స్పీకర్. వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. టీకా తీసుకోని వారు మాత్రం పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.