తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణ బిల్లుకు లోక్​సభ ఆమోదం - లోక్​సభ ఆమోదం

assisted reproductive technology bill: అసిస్టెండ్​ రీప్రొడక్టివ్​ టెక్నాలజీ క్లినిక్స్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. సంతాన సాఫల్య కేంద్రాలపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది.

parliament
పార్లమెంట్​

By

Published : Dec 1, 2021, 9:58 PM IST

assisted reproductive technology bill: సంతాన సాఫల్య కేంద్రాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుల ఆధారంగా చేసిన సవరణలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం.. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. సంతాన సాఫల్య కేంద్రాలపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది.

ఈ సందర్భంగా సింగిల్​ పేరెంట్స్​, ఎల్​జీబీటీక్యూ కమ్యూనిటీలు ఈ ప్రక్రియను వినియోగించటం నుంచి మినహాయించొద్దని ప్రభుత్వాన్ని కోరారు పలువురు సభ్యులు. అలాగే, సరోగసిపై బిల్లు రాజ్యసభలో పెండింగ్​లో ఉన్నట్లు చెప్పారు. మరో రెండు డ్రాఫ్ట్​ చట్టాలు సహా అన్నింటిని ఒకేసారి ఆమోదించాలని కోరారు. అసిస్టెడ్​ రీప్రొడక్టివ్​ టెక్నాలజీ బిల్​.. సరోగసి బిల్లుపై ఆదారపడి ఉందని తెలిపారు ఆర్​ఎస్​పీ నేత ఎన్​కే ప్రేమచంద్రన్​.

" సరోగసి బిల్లు ఎగువ సభలో పెండింగ్​లో ఉంది. ఇంకా ఆమోదం పొందలేదు. ఒక చట్టంపై ఆదారపడిన మరో బిల్లును ఈ సభ ఎలా ఆమోదిస్తుంది? ఈ బిల్లును పరిగణనలోకి తీసుకోలేమనేది నా పాయింట్​. "

- ఎన్​కే ప్రేమంచంద్రన్​, ఆర్​ఎస్​పీ నేత

ఆర్​ఎస్​పీ నేత ప్రశ్నలకు సమాధానమిచ్చారు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్​ మాండవియా. సరోగసి బిల్లు లోక్​సభలో ఆమోదం పొంది.. రాజ్యసభకు వెళ్లినట్లు గుర్తు చేశారు. ఆ తర్వాతే ఈ బిల్లులను తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు రెండు బిల్లులు రాజ్యసభ ముందు ఉన్నాయని పేర్కొన్నారు. సరోగసి బిల్లు లోక్​సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో ఏఆర్​టీ బిల్లును పరిగణనలోకి తీసుకుని ఆమోదిస్తున్నట్లు స్పీకర్​ ఓం బిర్లా స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:Farmers death: 'రైతుల మరణాలపై సమాచారం లేదు- సాయం చేయలేం'

ABOUT THE AUTHOR

...view details