తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇది సామాన్యుడికి అండగా నిలిచే బడ్జెట్‌: ప్రధాని - పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు 2021

parliament budget session
బడ్జెట్

By

Published : Feb 1, 2021, 8:36 AM IST

Updated : Feb 1, 2021, 3:26 PM IST

15:25 February 01

  • వైద్య రంగంపైనా ఎక్కువగా దృష్టి సారించాం: నిర్మలా సీతారామన్‌
  • ల్యాబ్‌లు, వైరాలజీ సంస్థల ద్వారా వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన: నిర్మలా సీతారామన్‌
  • కరోనా వేళ వైద్య పరీక్షలకు సౌకర్యాలు లేక ఇబ్బందిపడ్డాం: నిర్మలా సీతారామన్‌
  • జాతీయస్థాయిలో వైద్య రంగంలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం: నిర్మలా సీతారామన్‌
  • వైద్య రంగంలో గతేడాది కంటే 37 శాతం ఎక్కువగా కేటాయించాం: నిర్మలా సీతారామన్‌

15:08 February 01

  • సామాన్యుడికి అండగా నిలిచేలా బడ్జెట్‌ ఉంది: ప్రధాని మోదీ
  • అన్ని వర్గాలనూ సంతృప్తిపరిచేలా బడ్జెట్‌ ఉంది: ప్రధాని మోదీ
  • అన్ని రంగాల అభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్‌: ప్రధాని
  • బడ్జెట్‌లో మౌలిక వసతులకు పెద్దపీట వేశాం: ప్రధాని మోదీ
  • వ్యవసాయ మార్కెట్ల బలోపేతానికి చర్యలు: ప్రధాని మోదీ
  • ఆరోగ్య రంగం బలోపేతానికి బడ్జెట్‌లో నిధులు: ప్రధాని
  • మెరుగైన భవిష్యత్తు దిశగా బడ్జెట్‌లో నిర్ణయాలు: ప్రధాని

13:10 February 01

కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణే లక్ష్యంగా 2021-22కు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్రం. ఆరోగ్యం, సమ్మిళిత అభివృద్ధి, మూలధన పునరుత్తేజం, పరిశోధన, కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన అనే ఆరు మూల సూత్రాల ఆధారంగా రూపొందించిన పద్దును ఆవిష్కరించింది. ఉద్యోగాల సృష్టి, గ్రామీణాభివృద్ధి, భారత్‌లో తయారీ, పెట్టుబడుల ఆకర్షణపై ప్రధానంగా దృష్టి పెట్టింది. 

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు సుంకాల మార్గం ఎంచుకుంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సుంకం పేరిట పెట్రోల్, డీజిల్ సహా వేర్వేరు నిత్యావసరాలపై సుంకాల మోత మోగించింది. 

వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబుల మార్పు విషయంలోనూ ఎలాంటి కీలక ప్రకటన చేయలేదు కేంద్రం. 

12:57 February 01

ధరలు పెరిగే వస్తువులు

  • కాటన్​ ఉత్పత్తులు
  • రా సిల్క్​
  • వాహన విడి భాగాలు, సోలార్ పరికరాలు

12:44 February 01

  • ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 6.48 కోట్లకు చేరింది
  • 2014లో వారి సంఖ్య 3.31 కోట్లు ఉండేది
  • పన్ను వివాదాల స్పందన కాలపరిమితి 6 నుంచి మూడేళ్లకు తగ్గింపు

12:38 February 01

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు అంచనా 9.5 శాతం
  • 2021-22లో ద్రవ్యలోటును 6.8 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యం
  • ద్రవ్యలోటును ప్రభుత్వ అప్పుల ద్వారా భర్తీకి ప్రయత్నాలు
  • ఈ 2 నెలల్లో ఇంకా రూ.80 వేల కోట్లు  అప్పులు చేయాల్సి ఉంది
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.12 లక్షల కోట్లు అప్పులు తేవాలని నిర్ణయం
  • 2021-22 బడ్జెట్ అంచనా మొత్తం 34.83 లక్షల కోట్లు
  • 2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతం లోపు పరిమితం చేయాలని లక్ష్యం
  • 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు కేంద్రం ఆమోదం
  • పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా
  • పీఎంఏవై పథకం మరో ఏడాది పొడిగింపు
  • అందుబాటు ధరల గృహ రుణాల రాయితీ పథకం మరో ఏడాది పొడిగింపు
  • అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించే సంస్థలకు పన్ను విరామం మరో ఏడాది పొడిగింపు

12:34 February 01

  • ఐటీ రిటర్న్ దాఖలకు మినహాయింపు
  • 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరట
  • పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు

12:29 February 01

నిర్మల బడ్జెట్ ప్రసంగం

  • త్వరలో జాతీయ భాషా అనువాద కార్యక్రమం
  • రూ.4 వేల కోట్లతో డీప్ ఓషన్ మిషన్
  • త్వరలో జాతీయ నర్సింగ్, మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు
  • జనాభా లెక్కల కోసం రూ.3,726 కోట్లు
  • దేశ చరిత్రలో తొలిసారి డిజిటల్ విధానంలో జనగణన

12:22 February 01

  • 2021-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతం
  • జాతీయ అంప్రెంటీస్ చట్టానికి సవరణలు
  • యువతకు అవకాశాలు పెంచేలా కొత్త సవరణలు
  • జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా 15 వేల పాఠశాలలు ఆధునీకరణ
  • నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ విధివిధానాలు ఖరారు దశలో ఉన్నాయి
  • రానున్న ఐదేళ్లలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు రూ.50 వేల కోట్లు
  • డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ.1,500 కోట్లు

12:21 February 01

  • సామాజిక భద్రతా పథకాల్లోకి వీధి వ్యాపారులు
  • అంకుర సంస్థల ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు
  • ఏకవ్యక్తి నిర్వహణ సంస్థలకు ప్రోత్సాహకాలు
  • దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ రేషన్ అమలు
  • లేహ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు

12:18 February 01

  • 2020 డిసెంబరు నాటికి విద్యుదుత్పత్తి సంస్థలకు పంపిణీ సంస్థలు రూ.1.35 లక్షల కోట్లు బకాయి
  • గోవా డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు రూ.300 కోట్లు

12:11 February 01

  • వ్యూహాత్మక 4 రంగాలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ
  • స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మరో 100 సైనిక పాఠశాలలు
  • హైదరాబాద్‌లో 40 వరకు ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి
  • దేశవ్యాప్తంగా 9నగరాల్లో ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి ఉన్నాయి
  • వాటిని అనుసంధానిస్తూ ప్రత్యేక వ్యవస్థ

12:08 February 01

  • బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, మిగిలిన సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తిచేస్తాం
  • వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం
  • కుటుంబసభ్యులు వేర్వేరు చోట ఉన్నప్పుడు వాటా ప్రకారం రేషన్ తీసుకునే అవకాశం
  • పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత జాబితా తయారు చేయాలని నీతిఆయోగ్‌కు ఆదేశం

12:05 February 01

  • వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు
  • గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి రూ.40 వేల కోట్లు
  • 1,000 మండీలను ఈనామ్‌తో అనుసంధానం
  • రైల్వేలకు రూ.1,10,055 కోట్లు కేటాయింపు

12:02 February 01

  • బ్యాంకుల మొండి బకాయిల కోసం ఆస్తుల పునర్‌ వ్యవస్థీకరణ సంస్థ ఏర్పాటు
  • చిన్న సంస్థల నిర్వచనం మార్పు
  • రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకు చిన్నసంస్థలుగా గుర్తింపు

11:58 February 01

  • మరో కోటిమంది లబ్ధిదారులకు ఎల్‌పీజీ ఉజ్వల్ యోజన
  • ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూరాయి

11:55 February 01

  • 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం
  • బీపీసీఎల్‌, ఎయిరిండియా, ఐడీబీఐ, పవనాన్స్‌ కంటైనర్‌ కార్పొరేషన్లలో పెట్టుబడుల ఉపసంహరణ
  • ఈ ఏడాదిలో ఎల్‌ఐసీ ఐపీవో
  • మూలధన మద్దతు కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20 వేల కోట్లు

11:52 February 01

  • పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ కోసం రూ.18 వేల కోట్లతో ప్రత్యేక పథకం
  • మరో 100 జిల్లాల్లో పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా వ్యవస్థ
  • విద్యుత్ పంపిణీ వ్యవస్థలో కూడా పోర్టబులిటీ విధానం
  • శుద్ధ ఇంధన వనరుల విధానంలో భాగంగా హైడ్రోజన్ ఎనర్జీ మిషన్
  • కరోనా సంక్షోభ సమయంలోనూ పెట్టబుడల ఉపసంహరణ కొనసాగించాం

11:48 February 01

  • రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ.2 లక్షల కోట్లు
  • జాతీయస్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్‌బోర్డు
  • కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి నిర్వహణలో ఉన్న ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి
  • రూ.5 లక్షల కోట్ల డాలర్ల  ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అందుకోవాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి
  • 6,835 ప్రాజెక్టులతో జాతీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైపులైన్ ప్రారంభించాం
  • ప్రస్తుతం 7,40 ప్రాజెక్టులకు విస్తరించాం
  • దేశంలో వాయుకాలుష్య నియంత్రణకు రూ.2,217 కోట్లు
  • బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 నుంచి 74 శాతానికి పెంపు
  • పీపీపీ విధానంలో 7 పోర్టు ప్రాజెక్టులు
  • 2023 డిసెంబరు నాటికి దేశంలోని బ్రాడ్‌గేజ్ అంతా విద్యుదీకరణ

11:42 February 01

  • మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట
  • మౌలిక వసతులకు ఆదాయ వనరుల కోసం ప్రత్యేక సంస్థ
  • తయారీ రంగంలో మద్దతు కోసం ప్రత్యేక ఆర్థిక సంస్థ
  • ప్రత్యేక ఆర్థిక వ్యవస్థకు రూ.20 వేల కోట్ల మూలధనం
  • వచ్చే మూడేళ్లలో అందుబాటులో 5 లక్షల కోట్ల రుణాలు
  • ఐదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు
  • కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లు
  • అసోం, కేరళ, బంగాల్‌లో జాతీయ రహదారుల అభివృద్ధి
  • బంగాల్‌లో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి
  • 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
  • ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్
  • కరోనా సమయంలో రూ.27.1 లక్షల కోట్లతో ప్యాకేజీలు ప్రకటించాం
  • ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థను కాపాడి సంస్కరణలకు ఊతమిచ్చాయి
  • బడ్జెట్ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లు
  • ఇప్పటికే 2 వ్యాక్సిన్లు ఇస్తున్నాం.. త్వరలో మరో 2 టీకాలు రాబోతున్నాయి
  • పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం
  • గెయిల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ

11:37 February 01

  • కరోనా సమయంలో రూ.27.1 లక్షల కోట్లతో ప్యాకేజీలు ప్రకటించాం
  • ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థను కాపాడి సంస్కరణలకు ఊతమిచ్చాయి
  • బడ్జెట్ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లు

11:34 February 01

  • అసోం, కేరళ, బంగాల్‌లో జాతీయ రహదారుల అభివృద్ధి
  • బంగాల్‌లో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి
  • 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
  • ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్

11:27 February 01

  • మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట
  • మౌలిక వసతులకు ఆదాయ వనరుల కోసం ప్రత్యేక సంస్థ
  • తయారీ రంగంలో మద్దతు కోసం ప్రత్యేక ఆర్థిక సంస్థ
  • ప్రత్యేక ఆర్థిక వ్యవస్థకు రూ.20 వేల కోట్ల మూలధనం
  • వచ్చే మూడేళ్లలో అందుబాటులో 5 లక్షల కోట్ల రుణాలు
  • ఐదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు
  • కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లు

11:23 February 01

  • దేశంలోని వాహనాల ఫిట్‌నెస్ పరీక్షకు ప్రత్యేక విధానం
  • వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్లు
  • కాలపరిమితి ముగిసిన తర్వాత ఫిట్‌నెస్ పరీక్షకు వెళ్లాలని నిబంధన
  • ఆత్మనిర్భర్ ఆరోగ్య పథకానికి రూ.2,23,846 కోట్లు
  • ఆత్మనిర్భర్ భారత్ ప్రోత్సాహకాల్లో భాగంగా రూ.1.97 లక్షల కోట్లతో ప్రత్యేక నిధి
  • ఎంపిక చేసిన 13 రంగాల్లో పీఎల్ఐ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిధులు
  • రానున్న మూడేళ్లలో 7 టెక్స్‌టైల్స్ పార్కుల ఏర్పాటు

11:20 February 01

  • 2021కి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతాయి
  • సమ్మిళిత వృద్ధే లక్ష్యంగా ఈ ఏడాది బడ్జెట్ రూపొందించాం
  • ఆరోగ్య రంగంలో 64,180 కోట్లతో ప్రత్యేక నిధి
  • దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్ధరణ కేంద్రాలు
  • నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానాల పథకం
  • దేశంలో బీఎస్‌ఎల్-3 సౌకర్యాలతో 9 ల్యాబ్‌లు ఏర్పాటు
  • దేశంలో 4 ప్రాంతీయ వైరల్ ల్యాబ్‌లు ఏర్పాటు
  • పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్ మిషన్ అర్బన్
  • రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87 వేల కోట్లు
  • ఘనవ్యర్థాల నిర్వహణకోసం స్వచ్ఛభారత్ అర్బన్
  • ఐదేళ్లలో స్వచ్ఛభారత్ అర్బన్‌ కోసం రూ.1,41,670 కోట్లు

11:12 February 01

  • ఈ దశాబ్దానికి ఇదే మొదటి బడ్జెట్
  • ఆర్థిక వ్యవస్థ చరిత్రలో 3సార్లు మాత్రమే జీడీపీ మైనస్‌లో ఉంది
  • 2021 సంవత్సరం భారతదేశ చరిత్రలో అనేక మైలురాయిగా నిలవనుంది
  • ఆత్మనిర్భర్ భారత్ కొత్త ఆలోచన కాదు
  • పురాతన కాలం నుంచి భారత్ ఆర్థిక రంగంలో ముందుంది

11:09 February 01

నిర్మల ప్రసంగం

  • 3 ఆత్మనిర్భర్ ప్యాకేజీలు, తర్వాత చేసిన ప్రకటనలు ఆర్థిక వ్యవస్థను కాపాడాయి
  • భారత్‌లో ఇప్పటికే 2 వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చాం
  • భారత్‌లో మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి
  • వ్యాక్సిన్ల కోసం కృషిచేసిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు
  • ప్రపంచ దేశాలకు భారత్‌ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది

11:05 February 01

నిర్మల ప్రసంగం

  • లాక్‌డౌన్‌ పెట్టకపోయి ఉంటే భారతదేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేది
  • అత్యవసర సేవల సిబ్బంది తమ ప్రాణాలొడ్డి పనిచేశారు
  • విద్యుత్‌, వైద్యారోగ్యం, బ్యాంకింగ్‌, అగ్నిమాపక రంగాల్లో తమ ప్రాణాలొడ్డి పనిచేశారు

11:02 February 01

  • లోక్‌సభలో వార్షిక పద్దు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌
  • డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
  • ట్యాబ్‌లో చూసి బడ్జెట్ చదువుతున్న నిర్మలా సీతారామన్‌

10:48 February 01

ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్​.. 2021-22 ఏడాది వార్షిక బడ్జెట్ ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో బడ్జెట్​ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్‌.

10:44 February 01

లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా పార్లమెంటుకు చేరుకున్నారు. మరికాసేపట్లో సభలో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.

10:25 February 01

ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది.  బడ్జెట్, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపనుంది. అనంతరం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్‌.

10:07 February 01

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్​ పార్లమెంటుకు చేరుకున్నారు.

09:57 February 01

మొదటి బడ్జెట్​ ప్రతిని అందించేందకు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ను కలిశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​. ఇతర సీనియర్ అధికారులు కూడా వారితో పాటు ఉన్నారు.

09:35 February 01

కరోనా కారణంగా పార్లమెంటులో తొలిసారి కాగితపు రాహిత బడ్జెట్​ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్​ ప్రతుల సాఫ్ట్​ కాపీని ట్యాబ్​ ద్వారా చదివి వినిపించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.

09:17 February 01

  • నార్త్​ బ్లాక్​లోనే ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​తో భేటీ అనంతరం రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిసేందుకు బయల్దేరారు నిర్మల. ఆయనకు బడ్జెట్​ మొదటి ప్రతిని అందించనున్నారు.

08:50 February 01

పార్లమెంటులో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్​. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా కార్యాలయానికి ముందుగానే వెళ్లారు.

08:05 February 01

పద్దు: ఆరోగ్యానికి పెద్దపీట- సెస్​ పేరుతో వాత

కరోనా సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకున్న వేళ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కరోనా సృష్టించిన సవాళ్ల సుడిగుండంలో చిక్కుకున్న అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న వార్షిక పద్దు ఆర్థిక టీకా కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడంతో పాటు ఆరోగ్య రంగం, మౌలిక వసతులు, రక్షణ రంగానికి ఎక్కువ మొత్తం కేటాయించే అవకాశం ఉంది.

ఉదయం 11 గంటలకు లోక్​సభలో వార్షిక పద్దును ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. దేశాన్ని అన్ని రంగాల్లో సొంతకాళ్లపై నిలబడేలా చేయాలన్న లక్ష్యంతో ఈ బడ్జెట్​ తీసుకురాబోతున్నట్లు అంచనా.

కరోనా కారణంగా వివిధ సహాయాలు ప్రకటిస్తూ మినీ బడ్జెట్​ల పరంపర కొనసాగిందని, దానికి కొనసాగింపుగా బడ్జెట్​ ఉంటుందని ప్రధాని పార్లమెంటు సమావేశాల తొలిరోజు చేసిన వ్యాఖ్యలను బట్టి ఇందులో అందరికీ ఊరటనిచ్చే అంశాలు ఉండనున్నాయి. ఆర్థిక రంగానికి నిర్మలమ్మ ఏ టీకా ఇస్తారన్నది ఆసక్తి కలిగించే అంశం.

Last Updated : Feb 1, 2021, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details