రసాయన పరిశ్రమలో విషవాయువు లీక్- ఒకరు మృతి - undefined
19:25 December 11
రసాయన పరిశ్రమలో విషవాయువు లీక్- ఒకరు మృతి
Erode Plant Gas Leakage: తమిళనాడులోని ఈరోడ్‌లో గల రసాయన పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. క్లోరిన్ వాయువు లీకై ఒకరు మృతి చెందారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిటోడే ప్రాంతంలో దామోదరన్ అనే వ్యక్తి ఓ లిక్విడ్ క్లోరిన్ ఫ్యాక్టరీని నడుపుతున్నాడు. అయితే ఓ సిలిండర్‌లో క్లోరిన్ వాయువును నింపుతుండగా.. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై దామోదరన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 20మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అందులో 13 మంది స్పృహ కోల్పోయారు.
వెంటనే ఘటనాస్థలికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు.