Leopard and Bear in Tirumala Walkway: తిరుమల కాలిబాటలో క్రూర మృగాల భయం ఇంకా వెంటాడుతోంది.. గత సెప్టెంబరు 20న బోనులో చిక్కుకున్న ఆరో చిరుత తర్వాత నెల వ్యవధిలో చిరుతల సంచారం లేకపోవడంతో భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో చిరుతల సంచారం లేకపోవడం వలన.. టీటీడీ, అటవీ శాఖ అధికారులు ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపడంతో.. టీటీడీ అప్రమత్తమైంది. అలిపిరి నడక మార్గంలో ఈనెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్టుగా ట్రాప్ కెమెరాలో నమోదయింది. దీంతో నడక మార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, గుంపులు గుంపులుగా వెళ్లాలని కోరింది. మరో వైపు చిరుతను, ఎలుగుబంటిని బంధించేందుకు టీటీడీ, అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
Cheetah Trapped in a Cage in Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత..
Six Leopards Caught in Tirumala: కాగా భక్తులపై చిరుత దాడి చేయడం.. ఈ దాడిలో ఏ చిన్నారి ప్రాణం కోల్పోయినప్పటి (Girl Died in Leopard Attack in Tirumala) నుంచి.. తిరుమలలో చిరుతలను బంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆపరేషన్ చిరుత పేరుతో ఇప్పటి వరకూ ఆరు చిరుతలను పట్టుకున్నారు.
ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి..అటవీశాఖ అధికారులు వన్యప్రాణులు, కృూరమృగాల వంటి వాటి కదలికలను గమనిస్తున్నారు. కాలినడక మార్గంలో భక్తులకు చిరుతపులుల నుంచి రక్షణ కల్పించేందుకు అధికారులు బోనులను ఏర్పాటు చేసి.. ఆరు చిరుతలకు బంధించారు. నెల రోజులుగా చిరుతల సంచారం లేకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరోసారి చిరుత కనిపించడంపై భక్తులలో ఆందోళన వ్యక్తమవుతోంది.
Leopard Attacked on a Woman: మహిళపై చిరుత దాడి.. ఆస్పత్రిలో బాధితురాలు
Tiger in Prakasam District Ardhaveedu: ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలంలో పెద్దపులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్దిరోజులుగా అర్ధవీడు మండలంలోని లక్ష్మీపురం, బోల్లిపల్లి గ్రామాల పరిసర ప్రాంతాలలో పెద్దపులి తిరుగుతూ ఉండడంతో.. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లక్ష్మీపురం గ్రామ సమీపంలోని మేతకు వెళ్లిన ఓ గేదెపై పెద్దపులి దాడి చేసి చంపి తినేసింది. అంతేకాకుండా బొల్లిపల్లి గ్రామ సమీపంలో సైతం ఆవుపై దాడి చేసి హతమార్చింది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పెద్దపులి సంచారంపై నిఘా పెట్టారు. ఇప్పటికే పెద్దపులి తిరుగుతున్న పరిసర ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామాలకు అతి సమీపంలోనే నల్లమల అటవీ ప్రాంతం ఉండడంతో ఆహారం కోసం పెద్దపులి వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. పెద్దపులి తిరుగుతున్న ప్రాంతాలలో పులి పాదముద్రలను పరిశీలించి స్థానిక గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు.
Girl killed in Leopard Attack: తిరుమల నడకదారిలో తీవ్ర విషాదం.. చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న చిరుత