తన శక్తి మేర సమర్థంగా విధులు నిర్వహించానన్న సంతృప్తితోపాటు సంతోషం, సద్భావన, ఎన్నో జ్ఞాపకాలతో సుప్రీంకోర్టును వీడుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే తెలిపారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ ఎన్వీ రమణ తన విధులను సమర్థంగా నిర్వహిస్తారన్న నమ్మకం ఉందన్నారు.
"ప్రధాన న్యాయమూర్తిగా చివరి రోజు మిశ్రమ అనుభూతి మిగిల్చింది. ఈ భావాలను వర్ణించడం సాధ్యం కాదు. సంతృప్తితోపాటు, సంతోషం, సద్భావన, ఎన్నో జ్ఞాపకాలతో సుప్రీం కోర్టును వీడుతున్నాను. దేశ సర్వోన్నత ధర్మాసనంలో భాగస్వామిని కావడం గర్వంగా ఉంది. న్యాయమూర్తిగా 21 సంవత్సరాలు విధులు నిర్వహించిన తర్వాత పదవి నుంచి వైదొలుగుతున్నాను. ఇది నాకు చాలా జ్ఞాపకాలను మిగిల్చింది."
-- జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే