కేరళలో ఎప్పటిలానే ఎన్నికల మేనిఫెస్టోను మొదటగా విడుదల చేసి తన సంప్రదాయాన్ని ఎల్డీఎఫ్ కొనసాగించింది. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆకర్షణీయ పథకాలను ప్రకటించింది. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ కోసం 40లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. వ్యవసాయం రంగంలో ఆదాయాన్ని 50 శాతం పెంచేలా చర్యలు చేపడతామని తెలిపింది.
ఇదీ చూడండి:చర్చిల చుట్టూ రాజకీయం- ఓట్ల కోసం గాలం!
తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే 50 కార్యక్రమాల గురించి మేనిఫెస్టోను రెండు విభాగాలుగా తయారు చేసింది యూడీఎఫ్.
మేనిఫెస్టోలోని ముఖ్య హామీలు..
- ఏడాది కాలంలో 1.50లక్షల ఇళ్ల నిర్మాణం
- ప్రస్తుతం రూ.1600గా ఉన్న సంక్షేమ పింఛను దశల వారీగా ఐదేళ్లలో రూ.2500కు పెంపు
- గృహిణులకు ప్రత్యేక పింఛను పథకం
- రబ్బరు కనీస ధర కిలోకు రూ.250కి పెంపు
- తీరప్రాంత అభివృద్ధికి రూ.5000కోట్ల ప్యాకేజీ
- పేదరిక నిర్మూలనకు రుణ సాయం
- సమాజంలోని అన్నివర్గాల మత విశ్వాసాలను పరిరక్షించడం
- 2040వరకు విద్యుత్ సంక్షోభం లేకుండా ప్రత్యేక ప్రాజెక్టు